
అనన్య పాండే.. లైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాలవుడ్ బ్యూటీ. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించింది ఈ అందాల తార. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో అనన్యకు సైతం సౌత్ ఇండస్ట్రీలో అంతగా గుర్తింపు కూడా రాలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె నటించిన డ్రీమ్ గర్ల్ 2 చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది.కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది అనన్య. అయితే ఈసినిమా ప్రచార కార్యక్రమాల్లో అనన్య తన ఫ్యాషన్ స్టైల్ తో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.
ఇక ఇటీవల ఆమె డెనిమ్ ఆన్ డెనిమ్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది. మార్క్ జాకబ్స్ పిక్ ద్వారా హెవెన్ లో హై ఎండ్ లక్స్ రూట్ తీసుకుంది. ఈ డ్రెస్ ధర సుమారు రూ.40,500 అని తెలుస్తోంది.చిక్ డిస్ట్రెస్డ్ డిటైలింగ్ తో వచ్చిన ఈ చిరిగిన కార్సెట్ డెనిమ్ టాప్ ఉంది. భారీ వైడ్ లెగ్ జీన్స్‌తో జత చేయడంతో ఈ లుక్ లో మరింత అందంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం అనన్యకు సంబంధించిన ఈ డెనిమ్ లుక్ ఫోటోస్ నెట్టంట వైరలవుతున్నాయి. అంతేకాదు.. డ్రీమ్ గర్ల్ 2 ప్రమోషన్స్ కోసం అనన్య ఎంచుకున్న డ్రెస్సింగ్ స్టైల్ అభిమానులను కట్టిపడేస్తుంది. ఇటీవల ఆమె పసుపు పూల డ్రెస్ ధరించి కనిపించింది. అందమైన పిక్ అంతా కాంట్రాస్టింగ్ ఫ్లోరల్ మోటిఫ్ లతో వచ్చింది. ఆ ఫోటోస్ చూడండి.
ఇక అంతకు ముందు అనన్య మోనోక్రోమటిక్ ఫ్యాషన్ లో ఎక్కువగా ఉంటుంది. మోనోక్రోమ్ మ్యాజిక్ ఆమె లైనప్ కలిగి ఉంది. ఎలక్ట్రిక్ బ్లూ వెల్వెట్ గౌను, వన్ షోల్డర్ స్టైల్లో కనిపించింది. ఈ డ్రెస్ అనన్య అందానికి మరింత మెరుపునిచ్చింది.బ్లూడ్రెస్ ఫోటోస్ కింద ఉన్నాయి. అయితే లైగర్ తర్వాత అనన్య దక్షిణాదిలో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.