Kriti Sanon: బాబోయ్..సినిమా ప్రమోషన్స్ కోసమే 6 లక్షల ఖరీదైన డ్రెస్.. కృతి సనన్ రేంజే వేరే..

కృతి నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ బ్యూటీ ఇప్పుడు గణపథ్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించారు. హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ క్యూరియాసిటిని పెంచేసింది. మరోవైపు ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది చిత్రయూనట్.

Kriti Sanon: బాబోయ్..సినిమా ప్రమోషన్స్ కోసమే 6 లక్షల ఖరీదైన డ్రెస్.. కృతి సనన్ రేంజే వేరే..
Kriti Sanon

Updated on: Sep 29, 2023 | 9:49 PM

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్.. ఆదిపురుష్ సినిమాతో సౌత్ అడియన్స్ కు మరింత దగ్గరయ్యింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలై మిక్స్డ్ టాక్ అందుకుంది. కానీ కృతి నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ బ్యూటీ ఇప్పుడు గణపథ్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించారు. హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ క్యూరియాసిటిని పెంచేసింది. మరోవైపు ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది చిత్రయూనట్. హీరోహీరోయిన్స్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తెలుగులో ఈ మూవీ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేస్తూ చిత్రబృందానికి విష్ చేశారు.

ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకకు కృతి సనన్ బ్లాక్ డ్రెస్ లో హజరయ్యింది. ఆమెకు సంబంధించిన ఫోటోలను స్టైలిష్ట్ సుకృతి గ్రోవర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. డ్రెస్ సింపుల్ గా ఉన్నా ఎట్రాక్ట్ చేయడంతో ధర వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు నెటిజన్స్. ఇక బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన కృతి ఆ డ్రెస్ వివరాలను వెల్లడించింది. ఈ డ్రెస్ లగ్జరీ డిజైనర్ అలెగ్జాండర్ మెక్ క్వీన్ డిజైన్ చేశారట. ఈ లెదర్ ధర $5,750, అంటే రూ. 5.84 లక్షలు. ఆ డ్రెస్ ధర తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

కృతి సనన్ చివరిగా కార్తీక్ ఆర్యన్‌తో కలిసి షెహజాదాలో కనిపించింది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు కృతిసనన్.. మింట్ గ్రీన్ కో-ఆర్డ్ సెట్‌లో గ్లామ్-చిక్ లుక్‌లో కనిపించింది. ఈ డ్రెస్ ను డిజైనర్ అలెక్స్ పెర్రీ డిజైన్ చేశారు. అలాగే తన ప్రతి సినిమా వేడుకలకు సరికొత్త ఫ్యాషన్ లుక్ ఎంపిక చేసుకుంటూ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటుంది కృతి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.