KBC 14: రూ7.5 కోట్ల ప్రశ్న.. కవితా చావ్లా ఆన్సర్‌ చెప్పలేకపోయింది.. మరి మీరు చెప్పగలరా? లెట్స్ ట్రై..

Kaun Banega Crorepati 14: తాజాగా ప్రారంభమైన కేబీసీ 14వ సీజన్‌లోనూ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన కవితా చావ్లా ( Kavita Chawla) అనే ఓసామాన్య గృహిణి కోటీ రూపాయలు గెల్చుకుంది. తద్వారా ఈ సీజన్‌లో మొదటి కోటీశ్వరురాలిగా ఆమె గుర్తింపు పొందింది.

KBC 14: రూ7.5 కోట్ల ప్రశ్న.. కవితా చావ్లా ఆన్సర్‌ చెప్పలేకపోయింది.. మరి మీరు చెప్పగలరా? లెట్స్ ట్రై..
Kbc 14

Edited By:

Updated on: Sep 21, 2022 | 4:19 PM

Kaun Banega Crorepati 14: బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న టీవీ షో కౌన్‌ బనేగా కరోడ్‌ పతి. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమవుతోన్న ఈ క్విజ్‌షో ద్వారా ఎంతోమంది సామాన్యులు లక్షాధికారులు, కోటీశ్వరులయ్యారు. తమ కలలను సాకారం చేసుకున్నారు. తాజాగా ప్రారంభమైన కేబీసీ 14వ సీజన్‌లోనూ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన కవితా చావ్లా ( Kavita Chawla) అనే ఓసామాన్య గృహిణి కోటీ రూపాయలు గెల్చుకుంది. తద్వారా ఈ సీజన్‌లో మొదటి కోటీశ్వరురాలిగా ఆమె గుర్తింపు పొందింది. షో ఆద్యంతం తన తెలివితేటలు, సమయస్ఫూర్తితో ఆకట్టుకున్న కవిత బిగ్‌ బీ అమితాబ్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలిచ్చింది. కోటీ గెల్చుకుని గేమ్‌లో మరింత ఉత్సాహంతో ముందడుగు వేసింది.

కాగా ఈ రౌండ్‌లో 17వ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయిన కవిత గేమ్‌ నుంచి తప్పుకున్నారు. ఆ ప్రశ్న విలువెంతో తెలుసా సుమారు రూ.7.5 కోట్లు. ఇంతకీ బిగ్‌ బీ అడిగిన ఆ ప్రశ్న ఏంటంటే?

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయ క్రికెటర్‌ గుండప్ప విశ్వనాథ్. అయితే ఆయన ఈ ఘనతను ఏ జట్టుపై సాధించాడు?

ఇవి కూడా చదవండి

దీనికి అమితాబ్‌ ఇచ్చిన ఆప్షన్లు ఇవే..

A) సర్వీసెస్ B) ఆంధ్రా C) మహారాష్ట్ర D) సౌరాష్ట్ర

మొదట ఈ ప్రశ్నకు కవితా చాలా సేపు జవాబు కోసం ఆలోచించింది. కానీ సమాధానంపై స్పష్టత లేకపోవడంతో పాటు ఆమె దగ్గర ఎలాంటి లైఫ్ లైన్స్ కూడా లేవు. దీంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఆమె పోటీ నుంచి తప్పుకుంది. అయితే, ఆమెను వెళ్లేముందు ఏదైనా ఒక సమాధానం గెస్ చేయాల్సిందిగా బిగ్‌బీ అడిగారు. దీంతో కవితా ఆప్షన్ ‘A’ ను లాక్ చేసింది. కానీ అది తప్పు సమాధానం. మరి ఈ 7.5 కోట్ల ప్రశ్నకు సరైన సమాధానమేంటో మీరు ఊహించగలరా? తెలియకపోతే కింద చూడండి.

సరైన సమాధానం: ఆప్షన్‌ B (ఆంధ్రా)

మరిన్ని ఎంటర్ టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..