Karan Johar: ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేయనున్న స్టార్ ప్రొడ్యూసర్.. వైరల్ అవుతున్న ట్వీట్

బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ లో కరణ్ జోహార్ ఒకరు. ఇప్పటికే ఆయన పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా , ప్రొడ్యూసర్ గా..

Karan Johar: ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేయనున్న స్టార్ ప్రొడ్యూసర్.. వైరల్ అవుతున్న ట్వీట్

Updated on: Jul 05, 2021 | 10:06 PM

Karan Johar:

బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ లో కరణ్ జోహార్ ఒకరు. ఇప్పటికే ఆయన పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా , ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. అలాగే సెలబ్రెటీల వారసులను ఇండస్ట్రీ కి పరిచయం చేయాలంటే ముందుగా కరణ్ నే సంప్రదిస్తారు. గత కొంత కాలంగా కరణ్ జోహార్ సైలెంట్ గా ఉంటున్నారు. కాస్త గ్యాప్ తీసుకున్న కరణ్ ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీ కానున్నారు. కరోనా ఎంటర్ అవ్వడంతో సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ లన్ని ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే తిరిగి పరిస్థితులు చక్కబడుతున్నాయి. దాంతో షూటింగ్ లు కూడా ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేసారు. ఇప్పుడు ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. “రేపు నా నెక్స్ట్ సినిమాను ప్రకటించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. కుటుంబ మూలాల్లో లోతుగా పొందుపరిచిన ఆనందమైన ప్రేమకథ అది.”అని తెలిపారు.

కరణ్ జోహార్ ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. అందమైన ప్రేమకథలను అందించారు. తన జర్నీలో ఎన్నో అందమైన అనుభవాలు ఉన్నాయని. ఆయన ఓ వీడియో ను విడుదల చేశారు. “ఇది  ఓ క్రొత్త ప్రయాణానికి నాంది. ఇది నాకు ఇష్టమైన ప్రదేశానికి తిరిగి వెళ్ళే సమయం, లెన్స్ వెనుక నుండి కొన్ని శాశ్వతమైన ప్రేమ కథలను సృష్టించే సమయం. చాలా ప్రత్యేకమైన కథ, నిజంగా ప్రేమ మరియు కుటుంబం యొక్క మూలాలతో నిండినది”. అని ట్వీట్ చేశారు. తన నెక్స్ట్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఉన్నానని ఈ ట్వీట్ తో చెప్పకనే చెప్పారు కరణ్.

 

మరిన్ని ఇక్కడ చదవండి :

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ ను చుట్టుముట్టిన యాచకులు..కార్ ఎక్కిన వదలేదు..బ్రహ్మి కష్టమే నీకు అంటూ కామెంట్లు ..(వీడియో):Pragya Jaiswal Viral video.

Vijay Sethupathi : విక్రమార్కుడుగా విజయ్ సేతుపతి.. ‘ఆహా’ లో మరో ఇంట్రస్టింగ్ మూవీ..

Induvadana: న్యూ లుక్ లో అదరగొడుతున్న వరుణ్ సందేశ్.. ”ఇందువదన” నుంచి లిరికల్ సాంగ్