Kapil Sharma: “మన నవ్వులు శాశ్వతంగా ఉండాలంటే మొక్కలు నాటాలి”.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‏లో పాల్గొన్న కమెడియన్ కపిల్ శర్మ..

| Edited By: seoteam.veegam

May 18, 2023 | 6:53 PM

జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం నా మనసును కదిలించింది. “మనం మన కోసం కాదు.. ఇతరుల కోసం కూడా” అనే భావనను నాలో కలిగించింది. ఈ నేలపై మన భవిష్యత్ తరాలు బావుండాలని తలపెట్టిన ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. ఇదొక కార్యక్రమంలా కాకుండా మన బాధ్యతగా దీన్ని ముందుకు తీసుకుపోవల్సిన అవసరం ఉంది.

Kapil Sharma: మన నవ్వులు శాశ్వతంగా ఉండాలంటే మొక్కలు నాటాలి.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‏లో పాల్గొన్న కమెడియన్ కపిల్ శర్మ..
Kapil Sharma
Follow us on

మనిషికి సరిపడ ఆక్సిజన్ దొరికినప్పుడే మనమంతా ఆరోగ్యంగా ఉంటామని. దాంతో ప్రతీ సంఘటనను పాజిటివ్ గా తీసుకునే శక్తి మెదడుకు అందుతుందన్నారు ప్రముఖ బాలీవుడ్ స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)లో భాగంగా గురువారం ఆయన ముంబాయిలోని గోరేగాన్‏లోని “దాదాసాహెబ్ పాల్కే చిత్రాంగరి ఫిల్మ్ సిటీ”లో మొక్కలు నాటారు. కపిల్ శర్మతోపాటు.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ సైతం ఆయనతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం ఎంతో ఉన్నత ఆశయంతో కూడుకున్నదన్నారు కపిల్ శర్మ.

ఈ సందర్భంగా కపిల్ శర్మ మాట్లాడుతూ.. “జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం నా మనసును కదిలించింది. “మనం మన కోసం కాదు.. ఇతరుల కోసం కూడా” అనే భావనను నాలో కలిగించింది. ఈ నేలపై మన భవిష్యత్ తరాలు బావుండాలని తలపెట్టిన ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. ఇదొక కార్యక్రమంలా కాకుండా మన బాధ్యతగా దీన్ని ముందుకు తీసుకుపోవల్సిన అవసరం ఉంది. యావత్ దేశ ప్రజలంతా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. నా షో వీక్షిస్తున్న ప్రతీ ఒక్కరు ఒక మొక్కను నాటాలి.. జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పచ్చని ఆశయానికి అండగా నిలవాలని నా అభిమానులను కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. రాబోయే వర్షా కాలంలో ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతారని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను” అని అన్నారు.

Kapil Sharma, Santhosh Kuma

కపిల్ శర్మ హిందీలో ‘ది కపిల్ శర్మ’ అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఫేమస్ సెలబ్రెటీలను తనదైన స్టైల్లో ఇంటర్వ్యూ చేస్తుంటారు కపిల్. గతేడాది ఆర్ఆర్ఆర్ విడుదల సందర్భంగా రామ్ చరణ్, ఎన్టీఆర్, జక్కన్న ది కపిల్ శర్మ షోలో సందడి చేశారు. తాజాగా ది కపిల్ శర్మ షోలో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.