జల్లికట్టు చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన కంగనా రనౌత్, పనిలోపనిగా బాలీవుడ్ పెద్దలపై విమర్శలు
bashing Bullydawood gang ః బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్‌కు చెందిన పెద్దలపై సెటైర్లు వేశారు..

bashing Bullydawood gang ః బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్‌కు చెందిన పెద్దలపై సెటైర్లు వేశారు.. 93వ ఆస్కార్ అవార్డుల పోటీలకి ఇండియా తరఫున ఎంపికైన జల్లికట్టు చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూనే బాలీవుడ్ ప్రముఖులను విమర్శించారు.. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరిపై పెత్తనం చేయాలని చూసే బుల్లిదావుద్- Bullydawood గ్యాంగ్‌కు సరైన ఫలితాలే వచ్చాయంటూ దెప్పిపొడిచారు. భారతీయ చిత్రపరిశ్రమ అనేది కేవలం నాలుగు కుటుంబాలది మాత్రమే కాదంటూ కంగనా రనౌత్ ట్విట్ చేశారు. జల్లికట్టు చిత్రబృందానికి కంగ్రాట్స్ తెలిపారు. జల్లికట్టుతో పాటు శకుంతలాదేవి, గుంజన్ సక్సేనా, ఛపాక్, గులాబో సితాబో, చెక్‌పోస్ట్, స్కై ఈజ్ పింక్ వంటి ఓ 27 సినిమాలను పరిశీలించిన జ్యూరీ చివరకు జల్లికట్టును ఆస్కార్ పురస్కారాలకు పంపాలని నిర్ణయించింది. అంతర్లీనంగా మనుషులలో ఉండే క్రూరత్వాన్ని, జంతువుల పట్ల మనుషులు ప్రవర్తించే విధానాన్ని ప్రశ్నించే విధంగా సినిమా ఉందని జ్యూరీ ఛైర్మన్ అన్నారు. మరోవైపు జ్యూరీ నిర్ణయంపై జల్లికట్టు దర్శకుడు లిజో, నిర్మాత థామస్ పణికర్‌లు హర్షం వ్యక్తం చేశారు. 2019లో విడుదలైన జల్లికట్టు సినిమా ప్రేక్షకుల అభిమానాన్నే కాకుండా అనేక అవార్డులను గెల్చుకుంది..
