AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ulajh Teaser: జాన్వీ మరో సాహసం.. స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీతో జాన్వీ.. ‘ఉలజ్’ టీజర్ అదిరింది..

కంటెంట్ ప్రాధాన్యత.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కథ, కథనం, పాత్ర బలం చూసి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. అలాగే తన సినిమాలతో సినీ విమర్శకులను మెప్పిస్తుంది. ఇప్పుడు జాన్వీ ఫోకస్ పూర్తిగా సౌత్ ఇండస్ట్రీపైనే ఉంది. ఇప్పుడే తెలుగులో రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటు ఎన్టీఆర్ జోడీగా వస్తున్న దేవర షూటింగ్ వేగంగా జరుగుతుంది.

Ulajh Teaser: జాన్వీ మరో సాహసం.. స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీతో జాన్వీ.. 'ఉలజ్' టీజర్ అదిరింది..
Ulajh Teaser
Rajitha Chanti
|

Updated on: Apr 17, 2024 | 3:38 PM

Share

ధడక్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే ప్రశంసలు అందుకుంది జాన్వీ కపూర్. దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తనదైన సహజ నటన.. కంటెంట్ ఎంపికలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మొదటి నుంచి జాన్వీ ప్రత్యేకం. ఇప్పటివరకు కేవలం హీరోయిన్ గా గ్లామర్ రోల్స్ కాకుండా కంటెంట్ ప్రాధాన్యత.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కథ, కథనం, పాత్ర బలం చూసి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. అలాగే తన సినిమాలతో సినీ విమర్శకులను మెప్పిస్తుంది. ఇప్పుడు జాన్వీ ఫోకస్ పూర్తిగా సౌత్ ఇండస్ట్రీపైనే ఉంది. ఇప్పుడే తెలుగులో రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటు ఎన్టీఆర్ జోడీగా వస్తున్న దేవర షూటింగ్ వేగంగా జరుగుతుంది. అలాగే రామ్ చరణ్ సినిమాలో త్వరలోనే అడుగుపెట్టనుంది. కానీ ఇప్పుడు సైలెంట్ గా మరో కొత్త సినిమా టీజర్ రిలీజ్ చేసింది.

జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఉలజ్’. సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని జంగ్లీ పిక్చర్స్ బ్యానర్ పై వినీత్ జైన్ నిర్మిస్తున్నారు. ఇందులో జాన్వీ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. దేశానికి, విదేశాంగ శాఖకు సంబంధించిన కథగా.. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా విడుదలైన ఉలజ్ టీజర్ అదిరింది. అందులో జాన్వీ మరోసారి యాక్టింగ్ తో ఆశ్చర్యపరిచింది. అలాగే యాక్షన్ సీక్వెన్లతోనూ మెప్పించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఆదిల్ హుస్సనే, రాజేష్ తైలాంగ్, మెయాంగ్ చాంగ్, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి ప్రదాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాను ఈ ఏడాది జూలై 5న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం జాన్వీ దేవర సినిమా చిత్రీకరణతో బిజీగా ఉంది. ఇందులో తారక్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తమిళం, కన్నడ భాషలలో ఆఫర్స్ వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దేశవ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌లను ఎగబడి కొంటున్న జనాలు
దేశవ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌లను ఎగబడి కొంటున్న జనాలు
అక్కడేమో ఆడిట్ ఆఫీసర్.. ఇక్కడేమో బ్యాంకు బోర్డ్ మెంబర్.. చివరకు..
అక్కడేమో ఆడిట్ ఆఫీసర్.. ఇక్కడేమో బ్యాంకు బోర్డ్ మెంబర్.. చివరకు..
ఆ సినిమాలో శ్రీదేవి ఉన్నా నాకే అవార్డ్స్ వచ్చాయి.. సీనియర్ హీరోయి
ఆ సినిమాలో శ్రీదేవి ఉన్నా నాకే అవార్డ్స్ వచ్చాయి.. సీనియర్ హీరోయి
పొట్టి ప్రపంచకప్‌లో 2 సెంచరీలు.. 8 ఏళ్ల తర్వాత వన్డే అరంగేట్రం..
పొట్టి ప్రపంచకప్‌లో 2 సెంచరీలు.. 8 ఏళ్ల తర్వాత వన్డే అరంగేట్రం..
బ్రెయిన్ డెడ్‌తో మహిళ మృతి.. అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా..!
బ్రెయిన్ డెడ్‌తో మహిళ మృతి.. అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా..!
శక్తివంతమైన రాజయోగం.. ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్.. ఊహించని..
శక్తివంతమైన రాజయోగం.. ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్.. ఊహించని..
హోటల్ చెక్‌ ఇన్‌కి ఇక ఆధార్ అవసరం లేదు
హోటల్ చెక్‌ ఇన్‌కి ఇక ఆధార్ అవసరం లేదు
నా జీవితంలో ఆ సినిమా టర్నింగ్ పాయింట్.. దిల్ రాజు..
నా జీవితంలో ఆ సినిమా టర్నింగ్ పాయింట్.. దిల్ రాజు..
దేశ తొలి ‘రింగ్ మెట్రో’ ప్రారంభం.. మొదలైన కొత్త శకం
దేశ తొలి ‘రింగ్ మెట్రో’ ప్రారంభం.. మొదలైన కొత్త శకం
ఒకేసారి IT జాబ్, గర్ల్ ఫ్రెండ్.. హుఫ్! ఈ కుర్రాడి కథ మీకుచెప్పాలి
ఒకేసారి IT జాబ్, గర్ల్ ఫ్రెండ్.. హుఫ్! ఈ కుర్రాడి కథ మీకుచెప్పాలి