AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు.. సంచలన విషయాలు బయటకు..

ఈ ఘటనతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. కొన్ని రోజులుగా సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పులు జరిపేందుకు ప్లాన్ జరుగుతుందని షాకింగ్ సమాచారం బయటకు వచ్చింది. ఈ దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు హోలీ ఫెస్టివల్ అనంతరం నాలుగు రోజుల తర్వాత ముంబైలోకి వచ్చినట్లు తెలుస్తోంది. దుండగులు తమ కుటుంబ సభ్యులకు పని నిమిత్తం ముంబై వెళ్తున్నామని చెప్పినట్లు సమాచారం. చాలా రోజులుగా సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని..

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు.. సంచలన విషయాలు బయటకు..
Salman Khan
Rajitha Chanti
|

Updated on: Apr 17, 2024 | 5:19 PM

Share

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి బయట ఇద్దరు ఆగంతకులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిగిన సమయంలో సల్మాన్ తన కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటనతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. కొన్ని రోజులుగా సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పులు జరిపేందుకు ప్లాన్ జరుగుతుందని షాకింగ్ సమాచారం బయటకు వచ్చింది. ఈ దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు హోలీ ఫెస్టివల్ అనంతరం నాలుగు రోజుల తర్వాత ముంబైలోకి వచ్చినట్లు తెలుస్తోంది. దుండగులు తమ కుటుంబ సభ్యులకు పని నిమిత్తం ముంబై వెళ్తున్నామని చెప్పినట్లు సమాచారం. చాలా రోజులుగా సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని.. వీరిద్దరితో అన్మోల్ బిష్ణోయ్ టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

ఇక ఇప్పుడు మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ దాడి చేసిన వ్యక్తులు పన్వెల్‌లోని సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్‌కు కేవలం పది కిలోమీటర్ల దూరంలో అద్దెకు ఫ్లాట్ తీసుకున్నారట. సల్మాన్‌ ఫామ్‌ హౌస్‌కి దగ్గరగా ఉన్న ఫ్లాట్‌ను దుండగులు తీసుకోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ దాడికి పాల్పడిన వారిని పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం లారెన్స్ బిష్ణోయ్ తన ఫామ్‌హౌస్‌లో సల్మాన్ ఖాన్‌ను చంపాలని ప్లాన్ చేశాడని సమాచారం. అయితే ఆ ప్లాన్ విఫలమైంది.

దీంతో వీరిద్దరూ సల్మాన్ ఫామ్ హౌస్ సమీపంలోని ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని కొన్నాళ్లుగా బాలీవుడ్ స్టార్ పై నిఘా పెట్టినట్లు సమాచారం. సల్మాన్ ఇంట్లో ఉన్న సమయంలోనే కాల్పులు జరిపారు. సల్మాన్‌ఖాన్‌ ఇంటిపై కాల్పులు జరిపిన వారిద్దరు బీహార్‌కు చెందినవారే. ఈ కాల్పుల గురించి వారి కుటుంబ సభ్యులకు తెలియదని చెబుతున్నారు. దాడి చేసిన ఇద్దరూ పని కోసం ముంబైకి వెళుతున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పారని.. దాడి తర్వాత. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటోలను చూసి వారిద్దరి కుటుంబసభ్యులు గుర్తించారట. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన సాగర్ శ్రీజోగేంద్ర పాల్ తండ్రి రోజువారీ కూలీ. సల్మాన్ ఖాన్ ఇంటిపై తన కొడుకు షూట్ చేశాడని టీవీ ద్వారా తెలిసిందని అన్నారు. ఆ దాడికి సంబంధించి తమకు ఎలాంటి విషయాలు తెలియదని అన్నారు. మరో వ్యక్తి కొన్నాళ్లుగా జలంధర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us