Amitabh Bachchan: ఇక పై అలెక్సాలో అమితాబ్ వాయిస్.. లెట్స్ టాక్ విత్ ది వన్‌ అండ్‌ ఓన్లీ అమితాబ్‌

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ హోస్ట్ చేస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌పతి గురించి అందరికి తెలిసిందే. ఈ గేమ్ షో ద్వారా ఎంతోమంది సామాన్యులు తమ సమస్యలను తీర్చుకోవడమే కాకుండా..

Amitabh Bachchan: ఇక పై అలెక్సాలో అమితాబ్ వాయిస్.. లెట్స్ టాక్ విత్ ది వన్‌ అండ్‌ ఓన్లీ అమితాబ్‌
Amithab

Edited By:

Updated on: Aug 26, 2021 | 9:42 AM

Kaun Banega Crorepati : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ హోస్ట్ చేస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌పతి గురించి అందరికి తెలిసిందే. ఈ గేమ్ షో ద్వారా ఎంతోమంది సామాన్యులు తమ సమస్యలను తీర్చుకోవడమే కాకుండా కొంతమంది తమ కలలను కూడా నెరవేర్చుకున్నారు. ఇక ఇప్పుడు కౌన్‌ బనేగా కరోడ్‌పతి నయా సీజన్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. తెలుగులో ఎవరు మీలో కోటీశ్వరులు టెలికాస్ట్‌ స్టార్ట్ అయిన అదే రోజు(23న).. హిందీలో కౌన్‌ బనేగా కరోడ్‌పతి లేటెస్ట్ సీజన్‌ కూడా స్టార్ అయ్యింది. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ఈ సీజన్‌ టీజర్‌తో చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చారు మేకర్స్‌. లాస్ట్‌ ఇయర్‌ కోవిడ్ కారణంగా కేబీసీ ప్యాట్రన్ మార్చారు. ఫాస్టెస్ట్‌ ఫింగర్ ఫస్ట్‌ అనే రౌండ్‌ను తీసేసి డైరెక్ట్‌గా కంటెస్టెంట్‌ను హాట్‌ సీట్‌లోకి తీసుకువచ్చారు. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్‌ కాస్త బెటర్ అవ్వటంతో మళ్లీ పాత ఫార్మాట్‌నే కంటిన్యూ చేస్తున్నారు. ఫాస్టెస్ట్‌ ఫింగర్‌ ఫస్ట్ రౌండ్‌ను రీ ఇంట్రడ్యూస్ చేశారు. అంతేకాదు సోషల్ డిస్టాన్స్‌ మెయిన్‌టైన్‌ చేస్తూ ఆడియన్స్‌ను కూడా సెట్‌లోకి ఎలో చేశారు.

ఈ సీజన్‌లో బిగ్‌బీని డైరెక్ట్‌గా మీట్ అయ్యే ఛాన్స్ చాలా మంది కంటెస్టెంట్‌లకు దక్కబోతుందన్న మాట. అయితే లేటెస్ట్‌గా బిగ్‌ బీ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ కూడా వచ్చింది. ఇక మీద అభిమానులు అమితాబ్‌తో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు… జోక్స్‌ చెప్పమని అడగొచ్చు.. వెదర్‌ రిపోర్ట్‌ కూడా బిగ్‌ బీ వాయిస్‌లోనే తెలుసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా..? అలెక్సాలో ఇక మీద అమితాబ్‌ వాయిస్‌ కూడా వినిపించబోతోంది. సో ఫ్యాన్స్‌ బీ రెడీ టు టాక్ విత్ ది వన్‌ అండ్‌ ఓన్లీ అమితాబ్‌.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Seeti Maar: థియేటర్లలో సీటీ కొట్టే సమయం వచ్చేసింది.. గోపీచంద్‌ కొత్త చిత్రం విడుదల ఎప్పుడంటే.

తనపై వస్తున్న ఫేక్ న్యూస్ లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంచు వారి అబ్బాయి..:Manchu Manoj Video.

Sridevi Soda Center: సెన్సార్ పూర్తి చేసుకున్న శ్రీదేవి సోడా సెంటర్.. విడుదల ఎప్పుడంటే..