Ileana D’Cruz: బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ అందుకున్న గోవా బ్యూటీ.. ఈసారైనా క్లిక్ అయ్యేనా..

| Edited By: Rajitha Chanti

May 01, 2021 | 11:02 AM

టాలీవుడ్ లో ఒకప్పుడు వెలిగిన బ్యూటీ ఇలియానా. రామ్ నటించిన దేవదాస్ సినిమాతో పరిచయం అయిన ఈ చిన్నది. తెలుగులో వరుస ఆఫర్లు అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Ileana DCruz: బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ అందుకున్న గోవా బ్యూటీ.. ఈసారైనా క్లిక్ అయ్యేనా..
 టాలీవుడ్ లో వరుస అవకాశాలను దక్కించుకుంది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసింది ఇలియానా 
Follow us on

Ileana D’Cruz : టాలీవుడ్ లో ఒకప్పుడు వెలిగిన బ్యూటీ ఇలియానా. రామ్ నటించిన దేవదాస్ సినిమాతో పరిచయం అయిన ఈ చిన్నది. తెలుగులో వరుస ఆఫర్లు అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అక్కడ ఒకటి రెండు హిట్లు అందుకున్న ఇలియానాకు ఆతర్వాత ఆఫర్లు కరువయ్యాయి. దాంతో ఈ అమ్మడు కెరియర్ డైలమాలో పడింది. ఆ మధ్య ప్రేమించిన వాడితో విడిపోయి డిప్రషన్ లోకి వెళ్ళింది ఇలియానా. ఆతర్వాత బరువు పెరిగింది. ఆ టైంలోనే తెలుగులో రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

అయితే గోవా బ్యూటీ ఇలియానాకు మరో బిగ్ ఛాన్స్‌ ఇస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగన్‌. ఇప్పటికే రెండు సినిమాల్లో అవకాశం ఇచ్చిన అజయ్‌.. ఇప్పుడు డిజిటల్‌ ఎంట్రీలోనూ ఇల్లిబేబీకి సాయం చేస్తున్నారు. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న టైంలోనే బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు ఇలియానా. అయితే ఈ ప్రయోగం అమ్మడి కెరీర్‌ను కష్టాల్లో పడేసింది.

టాలీవుడ్‌ నుంచి బ్రేక్ తీసుకోవటం… బాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవటంతో ఇలియానా కెరీర్‌కు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్టే అనుకున్నారు అంతా. కానీ ఆ టైంలోనే `బాద్‌షాహో` సినిమాలో ఛాన్స్‌ ఇచ్చి ఇలియానాను ఆదుకున్నారు అజయ్‌ దేవగన్‌. తరువాత మరోసారి రైడ్ సినిమాలోనూ హీరోయిన్‌ ఛాన్స్ ఇచ్చారు.తాజాగా ఇలియానా డిజిటల్‌ ఎంట్రీకి కూడా అజయ్‌ దేవగనే రెడ్‌ కార్పెట్ వేస్తున్నారన్నది బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న మాట. ఇటీవల అజయ్‌ తన డిజిటల్‌ ఎంట్రీని కన్ఫామ్ చేశారు. రుద్ర అనే థ్రిల్లర్‌తో డిజిటల్‌ ఎంట్రీ ఇస్తున్న అజయ్‌… తనతో పాటు ఇలియానాకు కూడా ఓటీటీకి తీసుకెళ్తున్నారు. మరి సినిమాలో కెరీర్‌ కంటిన్యూ చేయలేకపోతున్న ఇలియానా… డిజిటల్‌ లో అయినా సత్తా చాటుతారేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: క‌రోనా వేళ అవ‌స‌ర‌మైన టిప్స్ చెబుతోన్న బుట్ట‌బొమ్మ‌.. ఈ ప‌రిస్థితుల్లో ఇది ఎంతో మేలు చేస్తుందంటా..

‘వకీల్ సాబ్’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో..! ఫ్యాన్స్‌కి పండగే.. వెంటనే చూసి ఆనందించండి..