Raj kundra: రాజ్ కుంద్రా కంపెనీపై గుజరాత్ షాప్ కీపర్ చీటింగ్ కేసు.. రూ. 3 లక్షలు నొక్కేశాడట !

పోర్న్ చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా (అప) 'ఖ్యాతి' గుజరాత్ రాష్జ్త్రానికి కూడా పాకింది. అహ్మదాబాద్ లోని ఓ వ్యాపారి తనను కుంద్రా ఆధ్వర్యంలోని వియాన్ కంపెనీ రూ.3 లక్షల మేర ఛీట్ చేసిందని ఆన్ లైన్ ద్వారా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు...

Raj kundra: రాజ్ కుంద్రా కంపెనీపై గుజరాత్ షాప్ కీపర్ చీటింగ్ కేసు.. రూ. 3 లక్షలు నొక్కేశాడట !
Gujarat Shopkeeper Case On Raj Kundra At Ahmadabad

Edited By: Anil kumar poka

Updated on: Jul 27, 2021 | 2:05 PM

పోర్న్ చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా (అప) ‘ఖ్యాతి’ గుజరాత్ రాష్జ్త్రానికి కూడా పాకింది. అహ్మదాబాద్ లోని ఓ వ్యాపారి తనను కుంద్రా ఆధ్వర్యంలోని వియాన్ కంపెనీ రూ.3 లక్షల మేర ఛీట్ చేసిందని ఆన్ లైన్ ద్వారా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు, సైబర్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. ఆన్ లైన్ క్రికెట్ స్కిల్ బేస్డ్ గేమ్ కి తనను డిస్ట్రిబ్యూటర్ ని చేస్తానని చెప్పి తన నుంచి 3 లక్షలు తీసుకుని మొండిచెయ్యి చూపిందని హీరేన్ పర్మార్ అనే ఈ వ్యాపారి ఫిర్యాదు చేశాడు. ఎంతకాలానికీ తనను డిస్ట్రిబ్యూటర్ ని చేయక పోవడంతో తాను చెల్లించిన సొమ్మును వాపసు చేయాలని కోరినా ఆ కంపెనీ నుంచి స్పందన లేదని ఈయన ఆరోపించాడు. తాను మోసపోయానని గ్రహించానన్నాడు. దీన్ని ‘గేమ్ ఆఫ్ డాట్ ‘ పేరిట గల ఆన్ లైన్ క్రికెట్ స్కిల్డ్ బేస్డ్ గేమ్ అంటారని, క్రికెట్ మీదున్న మక్కువతో తనీ అగ్రిమెంటుకు ఒప్పుకున్నానని ఆయన పేర్కొన్నాడు. 2019 లోనే నేను గుజరాత్ సైబర్ శాఖకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని హీరేన్ తెలిపాడు.

ఇక తన సొమ్ము పోయినట్టేనని కామ్ గా ఉండిపోయానని, కానీ పోర్న్ మూవీల రాకెట్ లో కుంద్రా అరెస్టయియినట్టు తెలియగానే..ప్రాణం లేచివచ్చినట్టు అనిపించి ఈ ఫిర్యాదు చేస్తున్నానని పేర్కొన్నాడు. తనలాగే చాలామంది కోట్ల రూపాయలు మోసపోయి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక కుంద్రా కేసులో ఇతని భార్య, నటి శిల్పా శెట్టి ప్రమేయం లేదని ముంబై పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తన భర్త నిర్వాకం కారణంగా తన సినీ కెరీర్ దెబ్బ తిన్నదని, ఎండార్స్ మెంట్లు తగ్గిపోయాయని శిల్పాశెట్టి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి : చిరంజీవి, ఎన్టీఆర్‌ చెప్పారని 4ఏళ్లు.. నేర్చుకున్నా..! యువహీరో తో ఇంట్రస్టింగ్ ఇంటర్వ్యూ:Hero Teja Sajja video.

 ఈ టీవీ ధర వింటే…మూర్ఛపోవడం ఖాయం..సరికొత్త టెక్నాలజీ రూపొందించిన శాంసంగ్‌:Samsung The Wall Video

 మంచుకొండల్లో చిక్కుకున్న యంగ్ హీరో.. అడ్వంచరస్‌ టూర్‌లో బిజీ బిజీ..: Navdeep Video.

 Jemimah Rodrigue Viral Video : ఇదేం బ్యాటింగ్‌ అక్క.. బౌలర్‌కు పిచ్చెక్కించావ్‌గా.. ! జెమిమా రోడ్రిగ్‌ అదిరిపోయే బాటింగ్ వీడియో.