AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: డిప్రెషన్‏తో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు బాలీవుడ్‏ను ఏలేస్తోన్న హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..

కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే మానసిక కుంగుబాటుకు గురైంది. డిప్రెషన్ సమస్యతో ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. కానీ తన తల్లి ఇచ్చిన ధైర్యం..మద్దతుతో ఆందోళన, ఒత్తిడి సమస్యలను ఎదుర్కొంది. తన అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎన్నో రికార్డ్స్ తన ఖాతాలో వేసుకుంది. సౌత్ ఇండియాకు చెందిన అమ్మాయి ఇప్పుడు నార్త్ ఇండియాలోనే టాప్ హీరోయిన్.

Tollywood: డిప్రెషన్‏తో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు బాలీవుడ్‏ను ఏలేస్తోన్న హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actress
Rajitha Chanti
|

Updated on: Jan 05, 2024 | 9:46 AM

Share

పైన ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తోంది. దశాబ్దాలుగా అగ్రకథానాయికగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పుడు సినీ పరిశ్రమలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు. కానీ ఒకప్పుడు కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే మానసిక కుంగుబాటుకు గురైంది. డిప్రెషన్ సమస్యతో ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. కానీ తన తల్లి ఇచ్చిన ధైర్యం..మద్దతుతో ఆందోళన, ఒత్తిడి సమస్యలను ఎదుర్కొంది. తన అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎన్నో రికార్డ్స్ తన ఖాతాలో వేసుకుంది. సౌత్ ఇండియాకు చెందిన అమ్మాయి ఇప్పుడు నార్త్ ఇండియాలోనే టాప్ హీరోయిన్. ఆమె తల్లిదండ్రులు బెంగుళూరులో నివసిస్తున్నారు. ఎవరో గుర్తుపట్టరా ?.. ఈరోజు ఆ చిన్నారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఆ చిన్నారి మరెవరో కాదు.. హీరోయిన్ దీపికా పదుకొణే.

బెంగుళూరులో 5 జనవరి 1986లో జన్మించింది దీపికా. ఆమె తండ్రి ప్రకాష్ పదుకొణె ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కాగా, ఆమె తల్లి ఉజ్వల పదుకొనే ట్రావెల్ ఏజెంట్. నటనపై ఆసక్తి ఉండడంతో తొమ్మిదేళ్ల వయసులో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అదే సమయంలో తన కుటుంబాన్ని విడిచి ఒంటరిగా ముంబై చేరుకుంది. 2007లో షారుఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కంటే ముందే ఆమె ఐశ్వర్య అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2006లో ఆ సినిమా విడుదలైంది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ఎక్కువగా షారుఖ్, సల్మాన్ సరసన నటించి మెప్పించింది.

సినిమాలే కాకుండా, ఫిల్మ్ ప్రొడక్షన్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో సహా అనేక కంపెనీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీపికా పదుకొణె చాలా సంపాదిస్తుంది. మీడియా కథనాల ప్రకారం దీపికా పదుకొణె నికర విలువ దాదాపు రూ.500 కోట్లు. అంతేకాకుండా.. ఆమె వద్ద మెర్సిడెస్ మేబ్యాక్ 500 కలిగి ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత ఖరీదైన వాహనాల్లో ఒకటి. అలాగే ఆడి ఎ8ఎల్, మినీ కూపర్ కన్వర్టిబుల్, ఆడి క్యూ7 వంటి విలువైన కార్లు ఉన్నాయి. బ్యూమాండే టవర్స్‌లో దీపికా పదుకొణెకు విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఈ 4 BHK అపార్ట్మెంట్ 2776 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ఇంటి విలువ రూ. 16 కోట్లు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.