AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: డైపర్లు మార్చిన అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. రూ.150 కోట్లకు యజమాని..

ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోడిగా వినయ విధేయ రామ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత తెలుగులో మరో ప్రాజెక్ట్ చేయలేదు. కానీ హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. షేర్షా, గుడ్ న్యూస్, కబీర్ సింగ్ వంటి హిట్ చిత్రాల్లో కనిపించి అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ అందుకుంది.

Tollywood: డైపర్లు మార్చిన అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. రూ.150 కోట్లకు యజమాని..
Actress
Rajitha Chanti
|

Updated on: Apr 24, 2024 | 8:36 AM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. ఫగ్లీ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఎంఎస్ ధోని.. ది అన్ టోల్డ్ స్టోరీ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. కియారా అద్వానీ కెరీర్‏ను మలుపు తిప్పిన సినిమా ఇదే. ఈ చిత్రం తర్వాత ఈ అమ్మడు వెనుదిరిగి చూసుకోలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాతో ఇటు తెలుగు తెరకు పరియమైంది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోడిగా వినయ విధేయ రామ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత తెలుగులో మరో ప్రాజెక్ట్ చేయలేదు. కానీ హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. షేర్షా, గుడ్ న్యూస్, కబీర్ సింగ్ వంటి హిట్ చిత్రాల్లో కనిపించి అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ అందుకుంది. ప్రస్తుతం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ హీరోయిన్.. సినిమాల్లోకి రాకముందు ఏ ఉద్యోగం చేసిందో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఇటీవల రేడియో సిటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కియారా అద్వానీ మాట్లాడుతూ తన ఫస్ట్ జాబ్ గురించి వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందు ఆమె తల్లి నిర్వహిస్తున్న ప్రీస్కూల్లో నర్సరీ టీచర్ గా పనిచేసేవారట. అప్పుడు పాఠశాలలో పిల్లలకు నర్సరీ రైమ్స్ నేర్పించడమే కాకుండా పిల్లల డైపర్స్ కూడా మార్చేదాన్ని అని తెలిపింది. అందుకే తనకు కబీర్ సింగ్, గుడ్ న్యూస్ సినిమాల్లో గర్భిణీ స్త్రీ పాత్రలు పోషించేందుకు ఎలాంటి సమస్య కలగలేదని తెలిపింది. “నేను ఉదయం 7 గంటలకు ప్రీ స్కూల్ కు వెళ్లి.. అక్కడే ఉండి పిల్లలను చూసుకునేదానిని. పిల్లలను మేనేజ్ చేసే విషయంలో అన్నీ నేను చేశాను. నర్సరీ రైమ్స్ పాడాను. వారికి అక్షరాలు, సంఖ్యలు నేర్పించాను. అలాగే వారికి డైపర్స్ కూడా మార్చాను. అందుకే నాకు గుడ్ న్యూస్, కబీర్ సింగ్ సినిమాల్లో గర్బిణీగా నటించడం అంతగా కష్టంగా అనిపించలేదు.” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే పిల్లలంటే తనకు చాలా ఇష్టమని.. బిడ్డను కలిగి ఉండేందుకు ఇష్టపడతానని తెలిపింది.

కియారా అద్వానీ 2023లో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి రాచరిక వివాహం జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో జరిగింది. వీరిద్దరి కలిసి షేర్షా సినిమాలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది పెళ్లి పీటలెక్కింది. నివేదికల ప్రకారం వీరిద్దరి ఆస్తుల విలువ రూ. 150 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us