Family Man-2: ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ విడుదల వాయిదా పడలేదు… స్పష్టం చేసిన అమేజాన్ ప్రైమ్…
Family Man Web Series Releasing Date: ఉగ్రవాదం కథాంశంతో తెరకెక్కిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమేజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది..

Family Man Web Series Releasing Date: ఉగ్రవాదం కథాంశంతో తెరకెక్కిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమేజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్‌కు కొనసాగింపుగా ఫ్యామిలీ మ్యాన్-2 తెరకెక్కిన విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. మొదటి సీజన్‌తో పోలీస్తే.. రెండో సీజన్‌పై భారీ అంచనాలున్నాయి. అక్కినేని కోడలు సమంత కూడా నటిస్తుండడంతో తెలుగులోనూ ఈ సిరీస్ కోసం వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ 2 విడుదలపై గతకొన్ని రోజులుగా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. అమేజాన్ వెబ్ సిరీస్‌లు.. మీర్జాపూర్, తాండవ్ వివాదస్పదం కావడంతో.. ఆ ప్రభావం ఫ్యామిలీ మ్యాన్ విడుదలపై ప్రభావం పడనుందని. సిరీస్ విడుదల వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. అయితే వీటిపై తాజాగా అమేజాన్ ప్రైమ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ సీజన్ వాయిదా పడలేదని ముందుగా ప్రకటించినట్లుగానే ఫిబ్రవరి 12న అమేజాన్ ప్రైమ్ వేదికగా విడుదలవుతుందని ప్రకటించింది.
Thank you for reaching out to us. Family Man season 2 will go live on February 12, 2021. Keep us posted for further updates. ^VT
— Amazon Help (@AmazonHelp) February 1, 2021
Also Read: ప్రేమికుల రోజున ప్రభాస్ సినిమా టీజర్ రాబోతోందా..? ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..




