Jacqueline Fernandez: హీరోయిన్ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. రూ.215 కోట్ల బెదిరింపు కేసులో నిందితురాలిగా జాక్వెలిన్..

|

Aug 17, 2022 | 12:38 PM

ఆర్థిక నేరస్తుడు సుఖేష్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ లబ్ధిపొందారని ఈడీ వర్గాలు తెలిపాయి. సుఖేష్ గురించి ముందుగానే జాక్వెలిన్‏కు తెలుసని స్పష్టం చేశారు అధికారులు.

Jacqueline Fernandez: హీరోయిన్ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. రూ.215 కోట్ల బెదిరింపు కేసులో నిందితురాలిగా జాక్వెలిన్..
Jacqueline Fernandez
Follow us on

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెడకు (Jacqueline Fernandez) మనీలాండరింగ్ కేసులో ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తోంది. రూ. 250 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా ఆమె పేరును చార్జీషీట్‏లో పేర్కొంది ఈడీ. ఆర్థిక నేరస్తుడు సుఖేష్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ లబ్ధిపొందారని ఈడీ వర్గాలు తెలిపాయి. సుఖేష్ గురించి ముందుగానే జాక్వెలిన్‏కు తెలుసని స్పష్టం చేశారు అధికారులు. అతడు ఇప్పటివరకు పొందిన నగదులో ఆమెకు భాగం ఉన్నట్లు గుర్తించారు. వీడియో కాల్స్ ద్వారా అతనితో జాక్వెలిన్ నిరంతరం టచ్‏లో ఉన్నట్లు కీలక సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సుఖేష్ సైతం జాక్వెలిన్‏కు బహుమతులు ఇచ్చినట్లు అంగీకరించాడు. గతంలో అతడి నుంచి జాక్వెలిన్ దాదాపు రూ.10 కోట్ల విలువైన బహుమతులు అందినట్లుగా తెలుస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఇప్పటివరకు ఆమెకు సంబంధించిన రూ. 7 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అంతేకాకుండా అతడితో సంబంధాలున్నాయంటూ పలుమార్లు ఈడీ జాక్వెలిన్‏ను ప్రశ్నించింది.

ఆర్థిక నేరస్తుడు సుఖేష్ చంద్రశేఖర్ పై ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో దాదాపు 32కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అలాగే మూడు కేంద్ర ఏజెన్సీలు, సీబీఐ, ఎన్ఫోర్మెంట్ డైరెక్టరేట్ , ఆదాయపు పన్ను శాఖలు మనీలాండరింగ్ కేసుపై దర్యాప్తు చేస్తున్నాయి. గతేడాది ఆగస్ట్, అక్టోబర్ నెలలో రికార్డ్ చేసిన స్టేట్మెంట్ లలో జాక్వెలిన్.. సుఖేష్ నుంచి గూచీ, చానెల్ నుంచి మూడు డిజైనర్ బ్యాగ్స్, జిమ్ వేర్ కోసం రెండు గూచీ దుస్తులను, ఒక జత లూయిస్ విట్టన్ షూస్, రెండు జతల డైమండ్స్ తీసుకున్నట్లుగా ఈడీకి తెలిపింది. అలాగే తనకు ఇచ్చిన మినీ కూపర్ కారును అతడిగి తిరిగి ఇచ్చినట్లు జాక్వెలిన్ తెలిపింది. గతేడాది ఆగస్ట్ 7న సుఖేష్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసేవరకు అతడితో జాక్వెలిన్ రెగ్యూలర్ కంటాక్ట్ లో ఉన్నట్లు ఈడీ గుర్తించింది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి భార్య నుంచి స్పూఫ్ కాల్స్ ద్వారా రూ. 215 వసూలు చేసినట్లు సుఖేష్ పై ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం, న్యాయశాఖ, హోంశాఖకు సంబంధించిన అధికారిగా నటిస్తూ సదరు బాధితురాలి నుంచి అతను డబ్బులు వసూలు చేశాడు. ఆమె భర్తకు బెయిల్ ఇప్పిస్తానని..తమ ఫార్మాస్యూటికల్ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తానని సుఖేష్ ఫోన్ కాల్స్‏లో చెప్పినట్లుగా తెలుస్తోంది.