
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ ఆకస్మికంగా మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 55 సంవత్సరాలు. మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆశిష్ హఠాన్మరణంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సూర్యవంశీ (2021) సినిమాలో అక్షయ్ కుమార్ తో కలిసి నటించి పాపులర్ అయ్యారు ఆశిష్ . ఆయన ఎక్కువగా సహాయక పాత్రలలో కనిపించింది. తన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇవి కూడా చదవండి : Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..
అజయ్ దేవగన్, టబు, శ్రియ శరణ్ నటించిన దృశ్యం (2015) సినిమాతో మరింత పాపులర్ అయ్యారు. ఈ చిత్రానికి నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించారు. ఏక్ విలన్ రిటర్న్స్ (2022), సర్కస్ (2022) , రాణి ముఖర్జీ మర్దానీ (2014) చిత్రాలలో నటించారు. మనోజ్ బాజ్‌పేయి ది ఫ్యామిలీ మ్యాన్ (2019) మొదటి సీజన్‌లో కూడా ఆయన నటించారు. రెండు దశాబ్దాలకు పైగా సినీరంగంలో ఉన్నారు. తరచుగా సహాయక పాత్రలు పోషించినప్పటికీ, వారంగ్ చిత్రణలు ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి.
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..
హిందీ, మరాఠీ, దక్షిణాది చిత్రాల్లో నటించారు. ఆశిష్ మరణంపై సినీప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. స్వతంత్ర చిత్రనిర్మాత అరిన్ పాల్ ఆయన మరణ వార్తను ధృవీకరించారు. “ఈరోజు నటుడు ఆశిష్ వారంగ్ మరణవార్త విని షాక్ అయ్యాను. ఆయనతో కలిసి పనిచేసే భాగ్యం నాకు లభించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన చేసిన పని ఆయన సృష్టించిన జ్ఞాపకాలలో నిలిచి ఉండాలి. ఆశిష్ జీ, మిమ్మల్ని మిస్ అవుతాను.” అంటూ రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..