AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Shetty: శిల్పా శెట్టి- రాజ్ కుంద్రాలకు బిగ్ షాక్.. లుకౌట్ నోటీసులు జారీ.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ స్టార్ కపుల్ శిల్పా శెట్టి- రాజ్ కుంద్రాల కష్టాలు ఇప్పుట్లో తీరిపోయేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఓ కేసులో ఈ దంపతులకు ముంబై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అసలు ఈ కేసు ఏమిటి? లుకవుట్ నోటీజులు జారీ సేసేలా శిల్పా శెట్టి దంపతులు ఏం తప్పు చేశారు?

Shilpa Shetty: శిల్పా శెట్టి- రాజ్ కుంద్రాలకు బిగ్ షాక్.. లుకౌట్ నోటీసులు జారీ.. ఏం జరిగిందంటే?
Shilpa Shetty
Basha Shek
|

Updated on: Sep 05, 2025 | 5:42 PM

Share

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆర్థిక, వ్యాపారా లావాదేవీలకు సంబంధించి ఈ దంపతులుపై తరచూ కేసులు నమోదవుతున్నాయి. ఒక కేసులో ఇప్పటికే జైలుకు కూడా వెళ్లొచ్చాడు రాజ్ కుంద్రా. అంతా బాగుంటుందనుకున్న తరుణంలో శిల్పా శెట్టి- రాజ్ కుంద్రాలపై మరో చీటింగ్ కేసు నమోదైంది. ప్రముఖ వ్యాపారవేత్త దీపక్ కొఠారి ముంబై పోలీసులకు ఈ ఫిర్యాదు చేశారు. ఇఇందులో శిల్పా శెట్టి, ఆమె భర్త రూ. 60 కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడీ చీటింగ్ కేసుతో శిల్పా దంపతులకు మరిన్ని ఇబ్బందులు ఎదురుకానున్నాయి. రాజ్ కుంద్రా, శిల్పాపై ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం కఠిన చర్యలకు ఆదేశించింది. లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ దీపక్ కొఠారి తన ఫిర్యాదులో శిల్పా శెట్టి దంపతులపై సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు దశాబ్దం క్రితం రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి తన నుంచి రూ.60 కోట్లు తీసుకున్నారని దీపక్ పేర్కొన్నారు. ఈ డబ్బుతో తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటామని రాజ్ హామీ ఇచ్చారని, దానికి సంబంధించి రెండు విడతలుగా రూ.60 కోట్లు చెల్లించానని కొఠారి తెలిపారు. అయితే డబ్బును వ్యాపారం కోసం వినియోగించకుండా, ఆ మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేశారని కొఠారి ఆరోపించారు.

కొన్ని రోజులకు కుంద్రా ఈ రుణాన్ని పెట్టుబడిగా మార్చమని తనను అభ్యర్థించారని, ప్రతి నెలా 12 శాతం వడ్డీతో సహా అసలు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారని కొఠారి చెప్పారు. దీని తరువాత, కొఠారి ఏప్రిల్ 2015లో షేర్ సబ్‌స్క్రిప్షన్ ఒప్పందం ద్వారా రూ.31.95 కోట్లు బదిలీ చేయగా, సెప్టెంబర్‌లో సప్లిమెంట్ ఒప్పందం ద్వారా రూ.28.53 కోట్లు మళ్లీ బదిలీ చేశాడు. ఈ నిధులన్నీ బెస్ట్ డీల్ టీవీ బ్యాంకు ఖాతాకు వెళ్లాయి. అయితే దీని తరువాత శిల్పా-రాజ్ లు తమ డబ్బును తిరిగి ఇవ్వలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారు తమ మాటను నిలబెట్టుకోలేదని, తన డబ్బును దుర్వినియోగం చేశారని దీపక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

శిల్పా శెట్టి దంపతులపై నమోదైన కేసును ముంబై పోలీసుల ఆర్థిక నేరాల నివారణ విభాగం దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు ఈ కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలకు కోర్టు లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. దీంతో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దేశం దాటి వెళ్లడానికి లేదు. అయితే తనపై వచ్చిన ఈ ఆరోపణలన్నీ అబద్ధమని, కోర్టు ద్వారా దీనికి సమాధానం ఇస్తానని రాజ్ కుంద్రా అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us