Priyanka Chopra: బాబోయ్.. పాములా సుడులు తిరిగిన ప్రియాంక చేతి వాచ్.. ఎన్ని కోట్లుంటుందో తెలుసా..
భారతదేశంలోని అత్యంత సంపన్న నటీమణులలో ప్రియాంక చోప్రా మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లాడి విదేశాల్లో ఉంటున్న ప్రియాంక.. తాజాగా ఇండియాకు తిరిగి వచ్చింది. జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్‌కు వచ్చిన నటి ప్రియాంక చోప్రా రెడ్ కార్పెట్ మీద డిఫరెంట్ డ్రెస్ వేసుకుని నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి ప్రియాంక ధరించిన డిజైనర్ దుస్తులతో పాటు ఆమె ధరించిన వాచ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే.. ప్రియాంక ధరించిన వాచ్ ధర వేలల్లోనో, లక్షల్లోనో కాదు కోట్లలో ఉంటుందట.

బాలీవుడ్ టూ హాలీవుడ్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బీటౌన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హాలీవుడ్ లో సత్తా చాటుతుంది. ఇటీవలే సిటాడెల్ సిరీస్ లో తన నటనతో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. భారతదేశంలోని అత్యంత సంపన్న నటీమణులలో ప్రియాంక చోప్రా మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లాడి విదేశాల్లో ఉంటున్న ప్రియాంక.. తాజాగా ఇండియాకు తిరిగి వచ్చింది. జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్‌కు వచ్చిన నటి ప్రియాంక చోప్రా రెడ్ కార్పెట్ మీద డిఫరెంట్ డ్రెస్ వేసుకుని నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి ప్రియాంక ధరించిన డిజైనర్ దుస్తులతో పాటు ఆమె ధరించిన వాచ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే.. ప్రియాంక ధరించిన వాచ్ ధర వేలల్లోనో, లక్షల్లోనో కాదు కోట్లలో ఉంటుందట.
మామి ఫిల్మ్ ఫెస్టివల్‌కి వచ్చిన నటి ప్రియాంక చోప్రా కంప్లీట్ వాచ్ కాకుండా అందమైన ఆభరణంలా కనిపించే డిఫరెంట్ వాచ్ ధరించింది. ఆమె ధరించిన వాచ్ బల్గారీ బ్రాండ్. దీనిని బంగారం , వజ్రం ఉపయోగించి తయారు చేస్తారు. ఈ వాచ్ ధర దాదాపు 1.50 కోట్ల రూపాయలు ఉంటుందని టాక్. దీంతో ఇప్పుడు ప్రియాంక ధరించిన వాచ్ ధర నెట్టింట తెగ వైరలవుతుంది.
View this post on Instagram
చాలా మంది బాలీవుడ్ నటీమణులతో పోలిస్తే హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇప్పుడు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ అందుకుంటుంది. కేవలం సినిమాల్లోనే కాకుండా యాడ్స్, బ్రాండ్ అంబాసిడర్ గాను ఎక్కువగానే అందుకుంటుంది. అంతేకాదు.. నటనతో పాటు పలు వెంచర్లలో పెట్టుబడులు పెట్టింది. ప్రియాంక ఒక హోటల్, ఆన్‌లైన్ షాపింగ్ సైట్, ఫ్యాషన్ బ్రాండ్, ముంబైలోని రియల్ ఎస్టేట్, సినిమా నిర్మాణ సంస్థలో కూడా పెట్టుబడి పెట్టింది. ఇటీవల ఆమె నటించిన యాక్షన్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై హిట్ అయ్యింది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
