Ranveer Singh: సినిమాల కంటే ఎక్కువగా సంపాదిస్తోన్న హీరో.. ఒక్కో యాడ్‌కు రణవీర్ సింగ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..
రణవీర్.. ఇటీవలే హాలీవుడ్ నటుడు జానీ సిన్స్ తో కలిసి ఓ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. గూగుల్ ట్రెండింగ్ లో కచ్చితంగా రణవీర్ చేసిన యాడ్ కనిపిస్తుంటుంది. అంతగా వాణిజ్య ప్రకటనలతో ఫేమస్ అయ్యాడు రణువీర్. అయితే నిజానికి ఒక్కో యాడ్ కోసం రణవీర్ ఎంత వసూలు చేస్తాడో తెలుసా ?.. ఇప్పుడు ఈ విషయం తెలుసుకోవడానికే అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మోడల్ కమ్ యాక్టర్.. రణవీర్ సింగ్ అడిషన్స్ కోసం లగ్జరీ బ్రాండ్ సంస్థలు వెయిట్ చేస్తుంటాయి.

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌కు పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు ఉన్నారు. అతడి యాక్టింగ్.. యాటిట్యూడ్.. స్టైల్‌కు స్పెషల్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రణవీర్.. ఇటు కమర్షియల్ యాడ్స్‌లోనూ ఎక్కువగా కనిపిస్తారు. తన భార్య దీపికాతో కలిసి అనేక ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రణవీర్.. ఇటీవలే హాలీవుడ్ నటుడు జానీ సిన్స్ తో కలిసి ఓ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. గూగుల్ ట్రెండింగ్ లో కచ్చితంగా రణవీర్ చేసిన యాడ్ కనిపిస్తుంటుంది. అంతగా వాణిజ్య ప్రకటనలతో ఫేమస్ అయ్యాడు రణువీర్. అయితే నిజానికి ఒక్కో యాడ్ కోసం రణవీర్ ఎంత వసూలు చేస్తాడో తెలుసా ?.. ఇప్పుడు ఈ విషయం తెలుసుకోవడానికే అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మోడల్ కమ్ యాక్టర్.. రణవీర్ సింగ్ అడిషన్స్ కోసం లగ్జరీ బ్రాండ్ సంస్థలు వెయిట్ చేస్తుంటాయి. కమర్షియల్ యాడ్ జనాల్లోకి తీసుకెళ్లేందుకు రణవీర్ సింగ్ కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా మారిపోయాడు.
ప్రస్తుతం ఈ హీరో నికర విలువ రూ. 360 కోట్లు. అయితే ఒక్కో యాడ్ కోసం రణవీర్ రూ. 3.5 నుంచి రూ. 4 కోట్లు మధ్య వసూలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఇది భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా అతని స్థితిని పటిష్టం చేసింది. 2022 సంవత్సరంలో, ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (IAA) అతనిని బ్రాండ్ ఎండార్సర్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తించింది. చింగ్స్ నుంచి బింగో వరకు, నివియా నుండి కోల్‌గేట్ వరకు వివిధ బ్రాండ్‌లలో రణవీర్ వర్క్ చేశాడు. అతడు చేసిన యాడ్స్ ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తాయి.
2010లో బ్యాండ్ బాజా బారాత్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు రణవీర్. ఆ తర్వాత సింగ్ లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్, లూటేరా, గుండే చిత్రాల్లో నటించాడు. పీరియాడికల్ డ్రామాలలో రణవీర్ సరిగ్గా సెట్ అవుతాడు. గతంలో అతడు నటించిన బాజీరావు మస్తానీ, పద్మావత్, చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా అతడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. 2012లో హీరోయిన్ దీపికా పదుకొణేతో కలిసి రామ్ లీలా సినిమాలో నటించాడు. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. 2018లో ఇటలీలోని లేక్ కోమోలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం రణవీర్ సింగమ్ ఎగైన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
