Dilip Kumar : మరోసారి అస్వస్థతకు గురైన ప్రముఖ నటుడు దిలీప్ కుమార్..

|

Jun 30, 2021 | 1:26 PM

బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ముంబైలోని హిందుజా హాస్పిటల్ లో చేరారు.

Dilip Kumar : మరోసారి అస్వస్థతకు గురైన ప్రముఖ నటుడు దిలీప్ కుమార్..
Dilip Kumar Hospital
Follow us on

బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ముంబైలోని హిందుజా హాస్పిటల్ లో చేరారు. గ‌త కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధుల‌తో ఇబ్బందిప‌డుతోన్న దిలీప్ కుమార్‌ను గతంలో కుటుంబసభ్యులు హాస్పటల్ లో చేర్పించారు. రెండు వారాల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక‌ దిలీప్ కుమార్ ఇద్దరు త‌మ్ముళ్లు అస్లాం ఖాన్‌, ఎహ్సాన్ ఖాన్ క‌రోనా కార‌ణంగా గ‌తేడాది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు. 1944లో ఆయన మొదటిసారి వెండితెరకు పరిచయమయ్యారు. వైవిధ్య చిత్రాల్లో న‌టించిన దిలీప్ కుమార్ దేశ వ్యాప్తంగా న‌టుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం పై రకరకాల వార్తలు వినిపించాయి. దిలీప్ కుమార్ అనారోగ్యంతో ఆసుప్రతిలో చేరినప్పటినుంచి.. ఆయన మరణించారంటూ.. పలు వార్తలు సోషల్ మీడియాలో.. వాట్సాప్ లలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఆయన భార్య సైరా భాను..ఆ వార్తలపై దిలీప్ కుమార్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ” వాట్సాప్‏లలో వచ్చే ఫార్వర్డ్ మెసేజ్‏లను నమ్మకండి. సాబ్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆమె తెలిపారు. ఇప్పుడు దిలీప్ కుమార్ హాస్పటల్ లో చేరడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Allari Naresh : “సభకు నమస్కారం” అంటున్న అల్లరి హీరో.. నరేష్ నయా మూవీ

Bimbisara: కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ క్రేజీ అప్డేట్.. టైం ట్రావెల్ నేపథ్యంలో సినిమా..?

Tirumala – Boyapati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి.. స్వామివారి సన్నిధిలో అఖండ రిలీజ్ పై క్లారిటీ