Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ బయోపిక్ రిలీజ్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా 'అజే: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి' అనే సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా విడుదలకు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో చిత్ర నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు.

Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ బయోపిక్ రిలీజ్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు
Ajey The untold story of Yogi movie

Updated on: Jul 16, 2025 | 7:41 AM

ఇటీవల రాజకీయ నాయకుల జీవితాల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్, అటల్ బిహారీ వాజ్‌పేయి, థాకరే, వైఎస్ రాజ శేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మన్మోహన్ సింగ్ తదితర రాజకీయ నాయకులపై సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా ఒక సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా విడుదలలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి’ . ‘ది మాంక్ హూ బికమ్ చీఫ్ మినిస్టర్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా రిలీజైన పోస్టర్ ఇప్పటికే ఆసక్తి రేపింది. ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమా విడుదలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, CBFC ఇబ్బందులను ఎదుర్కొంది.

‘అజయ్’ చిత్రానికి CBFC సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీనిపై ఆ చిత్ర నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ‘అజయ్’ చిత్రానికి సర్టిఫికేషన్ ఇవ్వడంలో CBFC ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని నిర్మాతలు ఆరోపించారు. నిర్మాతల పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు CBFCకి నోటీసు జారీ చేసి, సర్టిఫికేట్ జారీ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తుందో వివరించాలని కోరింది.

ఇవి కూడా చదవండి

శంతను గుప్తా రాసిన ‘ది మాంక్ హూ బికమ్ చీఫ్ మినిస్టర్’ పుస్తకం ఆధారంగా ‘అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి’ తెరకెక్కింది. అనంత్ విజయ్ జోషి యోగి ఆదిత్యనాథ్ పాత్రను పోషించారు. భోజ్‌పురి సినీ నటుడు నిర్హువా, పాన్ ఇండియా నటుడు పరేష్ రావల్, రాజేష్ ఖట్టర్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో పాత్రలు భాగమయ్యారు. యోగి ఆదిత్యనాథ్ బాల్యం నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన జీవితంలో జరిగిన అన్ని అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ‘అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి’ చిత్రానికి రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీతు మెంగి నిర్మిస్తున్నారు. దిలీప్ బచ్చన్, దిలీప్ మెంగి ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే సమకూర్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి