Bhairavi Vaidya: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో కన్నుమూసిన ప్రముఖ నటి

సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి భైరవి వైద్య (67) కన్నుమూశారు. పలు హిందీ సీరియల్స్, సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆమె గత ఆరు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. అయితే పరిస్థితి విషమించడంతో అక్టోబర్‌ 8న భైరవి కన్నుమూసినట్లు ఆమె కూతురు జానకి సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది.

Bhairavi Vaidya: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో కన్నుమూసిన ప్రముఖ నటి
Actress Bhairavi Vaidya

Updated on: Oct 13, 2023 | 3:10 PM

సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి భైరవి వైద్య (67) కన్నుమూశారు. పలు హిందీ సీరియల్స్, సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆమె గత ఆరు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. అయితే పరిస్థితి విషమించడంతో అక్టోబర్‌ 8న భైరవి కన్నుమూసినట్లు ఆమె కూతురు జానకి సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. ‘అమ్మ నాకు నువ్వే సర్వస్వం. మీరు మీ పిల్లలను పెంచడంతో పాటు వారి వారి కలలను సాకారం చేసుకునేలా తోడ్పడ్డారు. సినిమా, టీవీ, ఓటీటీ.. ఇలా అన్ని రంగాల్లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఆమె తన కుటుంబం కోసం ఎంతో ధార పోసింది. చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంది. ఈ జన్మలో నిన్ను నా తల్లిగా పొందడం నా ఆశీర్వాదం అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. అదే సమయంలో ఇక నువ్వు మా మధ్యన లేవు అని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాను. అమ్మా.. నేను మీ బిడ్డలం అని గర్వంగా చెప్పుకునేలా మేం ఎదుగుతామని ప్రమాణం చేస్తున్నాను. మిస్‌ యూ అమ్మా’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో రాసుకొచ్చింది జానకి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు భైరవి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

భైరవికి చిన్నప్పటి నుంచి నటనంటే చాలా ఇష్టమంట. ఈ ఆసక్తితోనే ‘తాళ్‌’ సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించింది. అక్షయ్ ఖన్నా, అనిలక్‌ కపూర్‌ ఐశ్వర్యరాయ్ నటించిన ఈ సూపర్‌ హిట్‌ సినిమాలో భైరవి ఓ కీ రోల్‌ పోషించింది. అలాగే సల్మాన్ ఖాన్ నటించిన ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’లోనూ నటించి మెప్పించింది. అలాగే అమీషా పటేల్ చిత్రం హుమ్‌రాజ్, ప్రియాంక చోప్రా ‘వాట్స్ యువర్ రాశి’ సినిమాల్లో కూడా కనిపించింది. సినిమాల్లోకి రాకముందు థియేటర్ ఆర్టిస్ట్‌ గా చాలా నాటకాల్లో నటించారు. అలాగే గత 45 ఏళ్లుగా హిందీ, గుజరాతీ సినిమాలు, సీరియల్స్‌లోనూ నటించి ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. కాగా భైరవి మరణవార్త విన్న తారలు షాక్ అవుతున్నారు. ఈక్రమంలో స్కామ్‌ 1992 నటుడు ప్రతీక్ గాంధీ ఎమోషనల్‌ అయ్యారు. ‘ భైరవితో కలిసి పనిచేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. చిరునవ్వుతో కూడిన ఆమె ముఖాన్ని నేను మరచిపోలేను’ అని తెలిపాడు ప్రతీక్‌. వీరితో పాటు పలువురు ప్రముఖులు కూడా భైరవి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మిస్ యూ అమ్మా..

ప్రముఖుల సంతాపం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.