AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: క్యాన్సర్‌ మూడో స్టేజ్‌.. ధైర్యంగా పోరాడుతోన్ననటి.. కీమో థెరపీ  తర్వాత ఇలా.. గుర్తు పట్టారా?

ఈ క్యాన్సర్ మహమ్మారి కారణంగానే ఏటా వేలాది మంది కన్నుమూస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే మనో నిబ్బరంతో క్యాన్సర్ లాంటి మహమ్మారలను అధిగమించవచ్చని చాలా మంది సెలబ్రిటీలు నిరూపిస్తున్నారు. పై ఫొటోలో ఉన్నది కూడా ఓ ప్రముఖ హీరోయిన్.

Actress: క్యాన్సర్‌ మూడో స్టేజ్‌.. ధైర్యంగా పోరాడుతోన్ననటి.. కీమో థెరపీ  తర్వాత ఇలా.. గుర్తు పట్టారా?
Bollywood Actress
Basha Shek
|

Updated on: Jul 07, 2024 | 11:36 AM

Share

దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది క్యాన్సర్ మహమ్మారి. ఎన్ని రకాల పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటివరకు ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో మందు కనిపెట్టకపోవడం మరింత విచారకరమైన విషయం. ఈ క్యాన్సర్ మహమ్మారి కారణంగానే ఏటా వేలాది మంది కన్నుమూస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే మనో నిబ్బరంతో క్యాన్సర్ లాంటి మహమ్మారలను అధిగమించవచ్చని చాలా మంది సెలబ్రిటీలు నిరూపిస్తున్నారు. పై ఫొటోలో ఉన్నది కూడా ఓ ప్రముఖ హీరోయిన్. ఆమెకు ఇప్పుడు క్యాన్సర్ మూడో స్టేజ్. అయితే భయంతో వణికిపోకుండా క్యాన్సర్ ను జయిస్తానంటూ ధైర్యంగా చెబుతోంది. కీమో థెరపీ చికిత్స కూడా చేయించుకుంటోంది. కాగా ట్రీట్ మెంట్ కు ముందగానే ఆమె జుట్టును కత్తిరించుకుంది. ఇప్పుడు ఈ నటి మెడ పైన, చేతి కింద కూడా కాలిన మచ్చలు కనిపిస్తున్నాయి. హిందీ సినిమాలు, సీరియల్స్ ను చూసే వారికి ఈ నటి ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్‌

ప్రస్తుతం క్యాన్సర్‌ మూడో స్టేజీతో ధైర్యంగా పోరాడుతోంది హీనా ఖాన్. ప్రస్తుతం కీమో థెరపీ ట్రీట్ మెంట్ చేయించుకుంటోంది. ఇటీవలే ఫస్ట్ కీమో థెరపీ పూర్తయ్యిందంటూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది హీనా ఖాన్. అందులో ఆమె చేతి కింద, మెడపైన కాలిన మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘ఈ ఫొటోల్లో మీకు నా శరీరంపై ఉన్న మచ్చలు కనిపిస్తున్నాయా? లేదా నా కళ్లలోని ఆత్మవిశ్వాసం కనిపిస్తోందా? ఈ కాలిన మచ్చలను చూసి నేనేం బాధపడటం లేదు. చికిత్స విజయవంతంగా ముందుకు సాగుతుందనడానికి ఇదే నిదర్శనం’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది హీనా. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు.. నువ్వొక ఫైటర్‌వి అంటూ నటికి ధైర్యం చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

హీనా  ఖాన్ శరీరంపై మచ్చలు..

జుట్టును కత్తిరించుకుంటోన్న బాలీవుడ్ బుల్లితెర నటి..

కీమో థెరపీకి ముందు హీనా ఖాన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.