TOP9 ET: వావ్‌..! 800 కోట్ల కల్కి | గ్రేట్‌! కల్కీ విషయంలో.. తప్పులు ఒప్పుకొన్న నాగి.

సినిమా రేంజ్‌ ట్విస్టులతో రాజ్‌ తరుణ్ కేసు ఇంట్రెస్టింగ్‌గా మారింది. తనను ప్రేమించి మోసం చేశాడని, ఇప్పుడు మాల్వీ అనే మరో హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నాడంటూ రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్యకే షాకిచ్చారు పోలీసులు. సరైన ఆధారాలు సమర్పించాలంటూ CRPC కింద నోటీసులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం లావణ్య అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. మరోవైపు మాల్వీ మల్హో్త్రా మీడియా ముందుకొచ్చారు.

TOP9 ET: వావ్‌..! 800 కోట్ల కల్కి | గ్రేట్‌! కల్కీ విషయంలో.. తప్పులు ఒప్పుకొన్న నాగి.

|

Updated on: Jul 07, 2024 | 11:03 AM

01.kalki collections: వావ్‌..! 800 కోట్ల కల్కి

కల్కి మూవీ స్టిల్ కలెక్షన్స్‌ను కుమ్మేస్తూనే ఉంది. కోట్లలో వసూళ్లను సాధిస్తూనే ఉంది. బాక్సాఫీస్‌ దగ్గర ఫైర్ రగిలిస్తూనే ఉంది. ఇప్పటికే రికార్డ్‌ లెవల్లో కోట్లు కలెక్ట్ చేస్తున్న ఈ మూవీ… తాజాగా 800 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఇదే విషయాన్ని చెబుతూ ఈ మూవీ మేకర్స్ నుంచి ఓ అదిరిపోయే.. పోస్టర్ బయటికి వచ్చింది. కలెక్షన్స్‌తో పాటు.. ఇప్పుడా పోస్టర్‌ కూడా నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

02.Kalki: అక్కడ రూ.150 కోట్లు.. బాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న కల్కి.!

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమా కేవలం తెలుగులోనే కాదు హిందీలోనూ అద్భుతాలు చేస్తుంది. ఇప్పటికే వారం రోజుల్లో నార్త్ బెల్ట్‌లో ఏకంగా 150 కోట్లకు పైగా వసూలు చేసింది కల్కి. బాహుబలి 2, సాహో, సలార్ తర్వాత మరోసారి 150 కోట్ల క్లబ్బులో చేరిపోయారు ప్రభాస్. కచ్చితంగా 1000 కోట్ల క్లబ్బులో కల్కి చేరుతుందని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్.

03.nag: గ్రేట్‌! కల్కీ విషయంలో.. తప్పులు ఒప్పుకొన్న నాగి.

తప్పులు ఒప్పుకోవడం తప్పు కాదు ఇన్‌ఫ్యాక్ట్ గొప్ప! ఇప్పుడు అదే పని చేసి.. గొప్పోడు.. మంచోడు అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇక రీసెంట్‌ గా మీడియా ముందుకు వచ్చిన ఈ స్టార్ డైరెక్టర్ తన సినిమాలో చాలా తప్పులు చేశానని.. జరిగాయని నిజాయితీగా ఒప్పుకున్నారు. ఫస్టాప్ సీన్స్ కంటే ఎడిటింగ్‌ని ఇంకాస్త గ్రిప్పింగ్‌గా చేసుండాల్సిందని .. ఇక మ్యూజిక్ కొన్నిచోట్ల ఎక్స్‌ట్రార్డనరీగా ఉన్నా.. కొన్నిచోట్ల మాత్రం అనుకున్నంతగా వర్కౌట్ కాలేదని, అక్కడ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సిందని అన్నారు. అలాగే డబ్బింగ్‌ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సిందని అన్నారు. తన నిజాయితీ మాటలతో.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ నయా పాన్ ఇండియా డైరెక్టర్.

04.Rajamouli : గ్రేట్ న్యూస్ రాజమౌళి పై డాక్యుమెంటరీ మూవీ.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి మీద నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీని రూపొందించింది. ఇన్ని బ్లాక్‌బస్టర్‌లు, ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఓ వ్యక్తి ఎంత కష్టపడ్డారు? దానికి ఎన్నేళ్లు పట్టిందనే కాన్సెప్టుతో మోడ్రన్‌ మాస్టర్స్ ని రూపొందించినట్టు చెప్పారు మేకర్స్. ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది ఈ డాక్యుమెంటరీ.

05.samantha reaction: తనను జైల్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.

వాయిస్ 01:
సోషల్ మీడియాలో మరోసారి సమంత హాట్ టాపిక్ అవుతోంది. హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో చేసే నెబ్యులైజేషన్ గురించి తాజాగా తన పాడ్‌క్యాస్ట్‌లో ప్రస్తావించడంతో.. ఓ చిన్నపాటి డిబెట్‌ను ఆమె షురూ చేసినట్టు అయింది. సమంత చెప్పిన హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో చేసే నెబ్యులైజేషన్ ప్రక్రియ చాలా డేంజర్‌ అని.. అది ప్రయత్నిస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉందని డాక్టర్ అభయ్ ఫిలిప్‌ సమంతపై నేరుగా విమర్శలు చేశారు. అవి కూడా కాస్త అతిగా.. అభ్యంతరకరంగా ఉన్నాయంటూ.. తాజాగా ఈయన కామెంట్స్‌ పై రియాక్టయ్యారు సమంత. ఒక పెద్దమనిషి తన పోస్ట్‌ను, సలహాలను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారని ఆ డాక్టర్‌ పై ఓ పోస్ట్‌ పెట్టారు. ఆయన కూడా డాక్టరే.. తన కంటే ఎన్నో విషయాలపై అవగాహన ఉంటుందనడంలో సందేహం లేదు.. కానీ.. తనను నిందించడం కంటే తనకు చికిత్స చేసిన డాక్టర్‌తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేదని హితవు పలికారు. చాలా కూల్‌గా ఈ డాక్టర్‌కు కౌంటర్‌ ఇచ్చేశారు.

06.raj tharun bigg twist: రాజ్‌ తరుణ్ – లావణ్య వ్యవహారంలో బిగ్ ట్విస్ట్

సినిమా రేంజ్‌ ట్విస్టులతో రాజ్‌ తరుణ్ కేసు ఇంట్రెస్టింగ్‌గా మారింది. తనను ప్రేమించి మోసం చేశాడని, ఇప్పుడు మాల్వీ అనే మరో హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నాడంటూ రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్యకే షాకిచ్చారు పోలీసులు. సరైన ఆధారాలు సమర్పించాలంటూ CRPC కింద నోటీసులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం లావణ్య అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. మరోవైపు మాల్వీ మల్హో్త్రా మీడియా ముందుకొచ్చారు. తనకు రాజ్‌ తరణ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజ్‌తరుణ్‌ తనకు సహనటుడు మాత్రమే అన్నారు. లావణ్య చెప్పేవన్నీ అబద్దాలే అన్న మాల్వీ… రాజ్‌తో నటించిన ప్రతి హీరోయిన్‌ని లావణ్య అనుమానిస్తుందన్నారు.

07.malvi reaction: రాజ్‌ తరుణ్‌తో ఎఫైర్.. నిజం ఏంటో చెప్పిన హీరోయిన్.

ఇక నటుడు రాజ్‌తరుణ్ ఎపిసోడ్‌లో లావణ్య ఆరోపణలను ఖండించారు నటి మాల్వీ మల్హోత్రా. తనపై లావణ్య తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారామె. రాజ్‌తరుణ్‌ సహనటుడు మాత్రమే.. అతని గురించి తనకేమీ తెలియదన్నారు. తమ కుటుంబంలో ఎవరూ లావణ్యను బెదిరించలేదనీ.. లావణ్యే తమ కుటుంబాన్ని బెదిరించిందనీ.. తన తల్లిదండ్రులకు ఫోన్లు చేసి టార్చర్ చేసిందనీ ఆరోపించారు మాల్వీ మల్హోత్రా.
లావణ్య అలా ఎందుకు చేస్తుందో తనకు అర్థం కావడం లేదని.. పచ్చి అబద్ధాలు చెప్తూ తమ కుటుంబ పరువు తీస్తున్న లావణ్యపై ఫిర్యాదు చేస్తానంటూ టీవీ9కు వివరించారు మాల్వీ మల్హోత్రా.

08.renuka swami: అన్నం తినిపించి మరీ.. హత్య చేశారట..!

రేణుకా స్వామి హత్య కేసులో మరో విషయం బయటికి వచ్చింది. తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర మెసేజ్‌లు చేస్తున్నారని రేణుకా స్వామిపై కోపం పెంచుకున్నారు దర్శన్. తన మనుషులతో కలిసి రేణుకా స్వామిని కిడ్నాప్ చేయించి.. తీవ్రంగా టార్చర్ చేసి హత్య చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఆయనను టార్చర్ చేసే ముందు.. పీకల దాకా అతనికి అన్నం తినిపించారట. అయితే రేణుకా స్వామి కడుపులో డైజెస్ట్ కాని పుడ్‌ శాంపిల్ దొరికిందని.. దీంతో విషయం బయటికి వచ్చిందని కన్నడ మీడియా తాజాగా చెబుతోంది.

09.xmen: రోహిత్ శర్మ నా ఫేవరెట్.. హాలీవుడ్‌ హీరో.

తన ఫేవరెట్ క్రికెటర్ రోహిత్ శర్మ అని అన్నారు మార్వెల్ సిరీస్‌ ఎక్స్ మెన్ హీరో హ్యూ జాక్‌మన్‌. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ స్టార్ హీరో.. తాను క్రికెట్‌కు పెద్ద ఫ్యాన్‌ అని చెప్పారు. క్రికెట్‌లో రోహిత్.. బీస్ట్ అని కొనియాడారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో మార్వెల్ ఇండియా తమ ఎక్స్‌ హ్యాండిల్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇండియన్స్ ను కాలర్ ఎగరేసేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి
బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి
అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు ఇవి..
అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు ఇవి..
ఫార్చ్యూనర్‌కు పోటీగా నిస్సాన్ నయా కార్ లాంచ్.. !
ఫార్చ్యూనర్‌కు పోటీగా నిస్సాన్ నయా కార్ లాంచ్.. !
తమన్నాకు క్షమాపణలు చెప్పిన సీనియర్ నటుడు..
తమన్నాకు క్షమాపణలు చెప్పిన సీనియర్ నటుడు..
మీ పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయా, లేదా.? ఇలా తెలుసుకోండి.
మీ పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయా, లేదా.? ఇలా తెలుసుకోండి.
టీమిండియాకు తాకిన విడాకుల ట్రెండ్.. లిస్ట్ చూస్తే పరేషానే
టీమిండియాకు తాకిన విడాకుల ట్రెండ్.. లిస్ట్ చూస్తే పరేషానే
సరికొత్త రంగుల్లో ఆ రెండు స్కూటర్లు రిలీజ్ చేసిన సుజుకీ..!
సరికొత్త రంగుల్లో ఆ రెండు స్కూటర్లు రిలీజ్ చేసిన సుజుకీ..!
సర్వర్లు అంటే ఏమిటి? ఎలా పని చేస్తాయి? అవి డౌన్ అయినప్పుడు..
సర్వర్లు అంటే ఏమిటి? ఎలా పని చేస్తాయి? అవి డౌన్ అయినప్పుడు..
మళ్లీ పుంజుకుంటున్న పేటీఎం.. నష్టాల నుంచి లాభాల వైపు..
మళ్లీ పుంజుకుంటున్న పేటీఎం.. నష్టాల నుంచి లాభాల వైపు..
కార్ లోన్ కావాలా? అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే..
కార్ లోన్ కావాలా? అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే..