Akshay Kumar: అభిమానులకు సారీ చెప్పిన అక్షయ్ కుమార్.. కారణం ఇదే

|

Apr 21, 2022 | 8:11 AM

స్టార్ హీరోలు సినిమాలతోపాటు యాడ్స్ ద్వారా కూడా అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఓ స్టార్ హీరో ప్రోమోట్ చేశారంటే ఆ ప్రోడక్ట్ జనాల్లోకి దూసుకుపోతుంది.

Akshay Kumar: అభిమానులకు సారీ చెప్పిన అక్షయ్ కుమార్.. కారణం ఇదే
Akshay Kumar
Follow us on

స్టార్ హీరోలు సినిమాలతోపాటు యాడ్స్ ద్వారా కూడా అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఓ స్టార్ హీరో ప్రోమోట్ చేశారంటే ఆ ప్రోడక్ట్ జనాల్లోకి దూసుకుపోతుంది. దాంతో ఎన్ని కోట్లు ఖర్చయినా స్టార్ హీరోలను తమ ప్రోడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా చేసుకుంటుంటారు. అయితే టాలీవుడ్‌తో పోల్చుకుంటే బాలీవుడ్‌లో హీరోలు ఎక్కువగా యాడ్స్‌తోనే గడిపేస్తుంటారు. స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) కూడా ఇప్పటికే పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఓ ప్రోడక్ట్ బ్రాండ్ అంబాసిడర్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. గతకొంతకాలంగా అక్షయ్ కుమార్ పాన్ మసాలాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అక్షయ్ ఇలా టొబాకో ప్రోడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం ఆయన అభిమానులకు నచ్చలేదు. దాంతో ఆయన పై ట్రోల్స్ మొదలైయ్యాయి. అభిమానుల నుంచి అనేక రిక్వస్ట్‌లు రావడంతో అక్షయ్ టొబాకో బ్రాండ్‌కు ఇకపై అంబాసిడర్‌గా కొనసాగనని ప్రకటించారు.

ఏప్రిల్ 21న (గురువారం) అర్ధరాత్రి సోషల్ మీడియాలో అక్షయ్ టొబాకో బ్రాండ్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అలాగే తన అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పటికే షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోలు ఈ పాన్ మాసాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. ఇక ఇటీవలే అక్షయ్ కుమార్ కూడా పాన్ మాసాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. దాంతో ఆయన పై ఒక్కసారిగా వ్యతిరేకత మొదలైంది. సోషల్ మీడియా వేదికగా అక్షయ్ ను ట్రోల్ చేస్తున్నారు. దాంతో అక్షయ్ ఓ లేఖను షేర్ చేశారు “నన్ను క్షమించండి. నేను నా అభిమానులు,శ్రేయోభిలాషులందరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా మీ నుంచి వస్తున్న స్పందన నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. నేను పొగాకును ఆమోదించలేదు.. ఆమోదించను కూడా. ఇక పై ఆ సంస్థ  బ్రాండ్ అంబాసిడర్ నుంచి తప్పుకుంటున్నా అని ఓ లేఖ రాసి పోస్ట్ చేశారు అక్షయ్. అలాగే పూర్తి ఎండార్స్‌మెంట్ ఫీజు చెల్లించాలని నిర్ణయించుకున్నాను. ఇక పై చట్టపరమైన ప్రకటనలకు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను.. మీ ప్రేమ , అభిమానం ఏళ్ళు నాతోనే ఉండాలి అని రాసుకొచ్చారు అక్షయ్ కుమార్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

F3 Movie: ఎఫ్ 3 సింగిల్ సాంగ్‏కు భారీ రెస్పాన్స్.. గంటల్లోనే మిలియన్ వ్యూస్..

Viral Photo: క్యూట్ చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి యూత్ ఫెవరేట్.. అమ్మడు ఆ పేరుతో చాలా స్పెషలండోయ్.. గుర్తుపట్టండి..

Ante Sundaraniki: నజ్రియా ఎవరి ఫోన్లు ఎత్తలేదు.. కానీ అందుకు థ్యాంక్స్.. హీరో నాని ఆసక్తికర కామెంట్స్..