Malaika Arora and Arjun Kapoor: త్వరలోనే ఏకం కానున్న లవ్‌బర్డ్స్‌.. మలైకా, అర్జున్‌ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌!

|

May 18, 2022 | 5:13 PM

Malaika Arora and Arjun Kapoor: గత నాలుగేళ్లుగా ప్రేమలో మునిగితేలుతోన్న ఈ ప్రేమ పక్షులు తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. ఇందులో భాగంగా వివాహ బంధంతో ఏకమవ్వాలని నిర్ణయించుకున్నారట.

Malaika Arora and Arjun Kapoor: త్వరలోనే ఏకం కానున్న లవ్‌బర్డ్స్‌.. మలైకా, అర్జున్‌ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌!
Arjun Kapoor Malaika
Follow us on

Malaika Arora and Arjun Kapoor: గతేడాది కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌, ఈ ఏడాది అలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌..తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకున్నారు. పెద్దల సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లిపీటలెక్కారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో ప్రేమ జంట చేరనుంది. వారే బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora) – హీరో అర్జున్‌ కపూర్‌ (Arjun Kapoor). గత నాలుగేళ్లుగా ప్రేమలో మునిగితేలుతోన్న ఈ ప్రేమ పక్షులు తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. ఇందులో భాగంగా వివాహ బంధంతో ఏకమవ్వాలని నిర్ణయించుకున్నారట. అన్నీ కుదిరితే ఈ ఏడాది శీతాకాలంలోనే ఈ ప్రేమ పక్షులు పెళ్లిపీటలెక్కనున్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే నవంబర్ చివరిలో గానీ, లేకపోతే డిసెంబర్ మొదట్లో గానీ తమ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ చేసినట్లు ప్రచారం నడుస్తోంది.

మలైక- అర్జున్‌ల పెళ్లి నిరాడంబరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే వెడ్డింగ్ డిన్నర్ మాత్రం భారీగా ప్లాన్ చేస్తున్నారట. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను ఈ విందుకు ఆహ్వానించనున్నారట. సీనియర్‌ హీరోయిన్‌ కరీనాకపూర్ మలైక, అర్జున్‌ల పెళ్లి వేడుకల బాధ్యతలను తీసుకుంటున్నారట. కాగా మలైకాకు ఇది వరకే సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌తో వివాహం జరిగిన విషయం తెలిసిందే. వారిద్దరికి అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాతే అర్జున్‌తో ప్రేమలో పడింది మలైక. కాగా మలైకాతో తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై మరోసారి వ్యంగంగా స్పందించాడు అర్జున్‌ కపూర్‌. నా గురించి నాకంటే మిగతా వారికే ఎక్కువగా తెలుస్తుంది’ అని ఇన్‌స్టా స్టేటస్‌లో రాసుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

Suriya: జైభీమ్‌ సినిమాను వెంటాడుతోన్న వివాదాలు.. సూర్య దంపతులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు..

Road Accident: వరంగల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్‌ బోల్తాపడి ఐదుగురి దుర్మరణం..

Aadhi Pinisetty – Nikki Galrani: ఆది, నిక్కీల పెళ్లి వేడుకలో నాని, సందీప్‌ కిషన్‌.. డ్యాన్స్‌లతో హోరెత్తించిన హీరోలు.. వీడియో వైరల్‌..