Varun Dhawan: ఈరోజుల్లో గృహ హింస సర్వసాధారణమైపోయింది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మహిళలపై వేధింపులు బాగా పెరిగిపోతున్నాయి. చివరకు కన్నవాళ్లు, కట్టుకున్నవాళ్లే రాబందుల్లాగా స్త్రీలను పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోలీసులకు చెబితే పరువు పోతుందన్న నేపథ్యంలో చాలామంది మనసులోనే తమ బాధను దాచుకుంటున్నారు. ఈక్రమంలో ఒక అమ్మాయి కూడా ఇలాగే గృహహింస బారిన పడింది. ధైర్యం చేసి పోలీసులకు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఆదరించేవారి కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసిన ఆ అమ్మాయి చివరకు ఒక స్టార్ హీరోను సహాయం అడిగింది. సోషల్ మీడియా వేదికగా తనను తండ్రి బారి నుంచి కాపాడాలని కోరింది. దీంతో తక్షణమే స్పందించిన ఆ హీరో బాధితురాలిని కాపాడేందుకు ముందుకొచ్చాడు. ఆ హీరో మరెవరో కాదు వరుణ్ ధావన్ (Varun Dhawan).. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.
అధికారులతో మాట్లాడతాను..
కాగా సోషల్ మీడియాలో వరుణ్ ధావన్‌కు సంబంధించిన ఫ్యాన్ పేజీని నిర్వహిస్తోన్న ఓ మహిళ ట్విట్టర్ వేదికగా ఇలా రాసుకొచ్చింది. ‘ నా తండ్రి నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు. ప్రతిరోజూ తాగొచ్చి తిడుతున్నాడు, కొడుతున్నాడు. నన్నే కాదు మా అమ్మను కూడా నిత్యం వేధిస్తున్నాడు. అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాక నిత్యం తాగొచ్చి మమ్మల్ని హింసిస్తున్నాడు. కొన్నిరోజుల నుంచి కనీసం తిండి కూడా పెట్టట్లేదు. పైగా పచ్చిబూతులు తిడుతూ శాపనార్థాలు పెడుతూ మాకు నరకం చూపిస్తున్నాడు. స్థానిక పోలీసులను సంప్రదించినా పట్టించుకోలేదు. వుమెన్ హెల్ప్‌లైన్ కూడా మాకెలాంటి సాయం చేయడం లేదు. దయచేసి మీరే ఏదైనా చేయండి. మమ్మల్ని కాపాడండి’ అంటూ హీరో వరుణ్ ధావన్‌ను, గుజరాత్ పోలీసులను ట్యాగ్ చేస్తూ వేడుకుంది. ఈ ట్వీట్‌పై స్పందించిన వరుణ్.. ‘ఇది చాలా సీరియస్ విషయం. ఒకవేళ ఇది నిజమే అయితే పై అధికారులతో మాట్లాడి తప్పకుండా నీకు సాయం చేస్తాను’ అని రిప్లై ఇచ్చాడు. దీనికి బాధితురాలు కూడా స్టార్ హీరోకు ధన్యవాదాలు తెలిపింది. కాగా నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే స్టార్ హీరోలు సామాన్యుల కష్టాలపై స్పందించడంపై వరుణ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. వరుణ్ చివరిసారిగా కూలీ నెంబర్1 మూవీలో కనిపించాడు. అతని తాజా చిత్రం జగ్ జగ్ జియో ఈ నెల 24న విడుదల కానుంది.
This an extremely serious matter and if this is true I will help will u and speak to the authorities. https://t.co/IaIOEMFk8u
— VarunKukooDhawan (@Varun_dvn) June 6, 2022
Also Read: