‘నేనొక హిందీ హీరోని తెలుగు సినిమాలు చేయను’.. వివాదాస్పదం అవుతున్న బాలీవుడ్ నటుడి మాటలు..!

|

Mar 31, 2022 | 3:17 PM

John Abraham: తెలుగు సినిమాలలో నటించనని తెగేసి చెప్పాడు బాలీవుడ్‌ హీరో, నటుడు జాన్‌ అబ్రహం. ‘జిస్మ్‌‌’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్‌ ‘ధూమ్‌’, ‘రేస్‌’ ‘సత్యమేవజయతే

నేనొక హిందీ హీరోని తెలుగు సినిమాలు చేయను.. వివాదాస్పదం అవుతున్న బాలీవుడ్ నటుడి మాటలు..!
John Abraham
Follow us on

John Abraham: తెలుగు సినిమాలలో నటించనని తెగేసి చెప్పాడు బాలీవుడ్‌ హీరో, నటుడు జాన్‌ అబ్రహం. ‘జిస్మ్‌‌’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్‌ ‘ధూమ్‌’, ‘రేస్‌’ ‘సత్యమేవజయతే’, ‘సత్యమేవజయతే-2’ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులని అలరించాడు. యాక్షన్‌ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. తాజాగా అతడు నటించిన ‘ఎటాక్‌’ సినిమా రెండు పార్ట్‌లుగా విడుదల కానుంది. ఇందులో పార్ట్‌ 1 ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో ‘ఎటాక్‌’ బృందంతో కలిసి జాన్‌ అబ్రహం ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సమయంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జాన్‌ చెప్పిన సమాధానం వివాదాస్పదంగా మారుతోంది. టాలీవుడ్ హీరో ప్రభాస్‌ నటిస్తున్న ‘సలార్‌’లో జాన్‌ అబ్రహం ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. దీనిపై చిత్రబృందం కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ‘‘సలార్‌’లో మీరు సపోర్టింగ్‌ రోల్‌ చేయనున్నారంట కదా నిజమేనా?’’ అని ఓ రిపోర్టర్‌ జాన్‌ని ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా ‘‘ఇతర నటీనటుల మాదిరిగా తెలుగు లేదా ఏదో ఒక ప్రాంతీయ భాషా చిత్రంలో నేనెప్పటికీ నటించను. నేనొక హిందీ సినిమా హీరోని. నటుడ్ని కాబట్టి ఏదో ఒక సినిమాలో స్క్రీన్‌పై కనిపించాలనే ఉద్దేశంతో సెకండ్‌ హీరోగా చేయను’’ అని చెప్పారు. దీంతో జాన్‌ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వివాదాస్పదంగా మారుతున్నాయి.

PNB Instant Loan: పీఎన్‌బీ బంపర్‌ ఆఫర్.. వారికి సులువుగా 8 లక్షల రుణం..!

Travelling Plan: సాహసయాత్ర చేయాలనుకుంటే ఢిల్లీ నుంచి లేహ్ గొప్ప ఎంపిక.. ఎందుకంటే..?

ఏప్రిల్‌ 1 నుంచి ఈ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టండి.. మంచి రాబడిని పొందండి..!