
పై ఫొటోలో సన్నగా, స్లిమ్ లుక్ లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆయనొక స్టార్ సెలబ్రిటీ. ఫేమస్ ఫిల్మ్ మేకర్. ఆయన భార్య కూడా స్టార్ హీరోయిన్. ఒకప్పుడు తన అందం, అభినయంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. తెలుగుతో పాటు హిందీలో లెక్కలేనన్నీ సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇప్పటికీ ఆమెను ఆరాధించే అభిమానులు, హీరోలు ఉన్నారంటే అతి శయోక్తి కాదు. ఇక ఇప్పుడు వీరి కూతురు కూడా హీరోయిన్ గా రాణిస్తోంది. తల్లి అడుగు జాడల్లోనే నడుస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే మొన్నటివరకు ఎంతో లావుగా కనిపించిన ఈ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు ఉన్నట్లుండి స్లిమ్ గా మారిపోయారు. భారీగా బరువు తగ్గి సన్నగా కనిపిస్తున్నారు. ఈయన కొత్త లుక్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నరు. చాలా మంది మొదట గుర్తు పట్టలేకపోయారు కూడా. మరి పై ఫొటోలో ఉన్నదెవరో మీరు గుర్తు పట్టారా? ఆయన మరెవరో కాదు అలనాటి అందాల తార శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్.
ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బోనీ కపూర్ లేటెస్ట్ ఫొటోలు షేర్ చేశాడు. దీంతో అవి ఒక్కసారిగా నెట్టింట వైరల్ గా మారాయి. నిజంగా ఇతను బోనీ కపూరేనా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక తన వెయిట్ లాస్ టిప్స్ విషయానికి వస్తే.. అసలు జిమ్ కు వెళ్లకుండానే 26 కిలలు తగ్గారట బోనీ కపూర్. ఇక ఆయన డైట్ ప్లాన్ విషయనికి వస్తే.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పండ్లు, పండ్ల రసాలు, జవర్ రోటీ మాత్రమే తీసుకున్నారట. మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో సలాడ్లు, సూప్‌లు వంటి తేలికపాటి ఆహారం మాత్రమే తిన్నారట. అలాగే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారానికే ప్రాధాన్యమిచ్చారట. ఇ అనవసరమైన విందులు, ఫంక్షన్స్ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉన్నారట. ఈ మార్పు వెనక ఎలాంటి మాయ, స్పెషల్ ట్రైనింగ్ ఏమీ లేదని, జిమ్ కు కూడా వెళ్లలేదంటున్నారు బోనీ కపూర్. కేవలం డెడికేషన్, ఆత్మనిబ్బరం తోనే ఇలా సన్నగా మారిపోయానని చెబుతున్నారీ స్టార్ ప్రొడ్యూసర్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.