Deepika Padukone: జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్

మానసిక ఆరోగ్యంపై  మరోసారి నోరు విప్పింది దీపిక. డిప్రెషన్‌ కారణంగా తానెంత మానసిక వేదన అనుభవించానో గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురైంది.

Deepika Padukone: జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్
Deepika Padukone
Follow us
Basha Shek

|

Updated on: Oct 30, 2022 | 1:19 PM

సినిమా తారల లైఫ్‌ ఎంతో లగ్జరీగా ఉంటుందనుకుంటారు చాలామంది. చేతినిండా డబ్బు, విలాసాలతో ఎంజాయ్‌ చేస్తారనుకుంటారు. అయితే వాళ్లు కూడా సాధారణ మనుషులేనని, వారికి కష్టాలు, కన్నీళ్లు ఉంటాయని తెలియదు. పైగా సెలబ్రిటీలు కావడంతో అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. ఇతరులతో పోల్చితే ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి సమస్యలు వారిలోనే అధికంగా ఉంటాయి. ఈనేపథ్యంలో సినిమా తారల్లో చాలామంది మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి సమస్యలతో తమలోతామే కుంగిపోతుంటారు. మరికొందరు ధైర్యంగా తమ సమస్యలను బయటపెట్టి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఈకోవకే చెందుతుంది బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె. సినిమా ఇండస్ట్రీలో ఆకాశమంత క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. రిలేషన్‌ షిప్‌కు సంబంధించి కొందరి చేతుల్లో మోసపోయింది. అదే సమయంలో డిప్రెషన్‌కు గురైంది. ఒకనొక సమయంలో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. తాజాగా మానసిక ఆరోగ్యంపై  మరోసారి నోరు విప్పింది దీపిక. డిప్రెషన్‌ కారణంగా తానెంత మానసిక వేదన అనుభవించానో గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురైంది.

డిప్రెషన్‌ బారిన పడినట్లు 2014లో మొదటిసారి గుర్తించాను. ఆసమయంలో అంతా చిత్ర విచిత్రంగా అనిపించేది నాకు. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఏపని చేయాలన్న ఆసక్తి ఉండేది కాదు. ఎవర్నీ కలవాలనిపించేది కాదు. ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడేదాన్ని. బయటికి వెళ్లాలన్నా చిరాకు, భయం వచ్చేది. చాలాసార్లు నా జీవితానికి ఓ అర్థం లేదని, ఇంకా బతికి ఉండకూడదని అనిపించేది. ఆత్మహత్య చేసుకుందామనిపించేది’ అని తన చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంది దీపిక. ఈ క్లిష్ట సమయంలో తన తల్లిదండ్రులు అందించిన సహకారం మరువలేనిదని, వారివల్లే డిప్రెషన్‌ను అధిగమించానంటూ చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ‘ఒకసారి అమ్మానాన్నలు నన్ను చూసేందుకు బెంగళూరు నుంచి ముంబై వచ్చారు. అయితే వాళ్లు తిరిగి వెళ్లేటప్పుడు విమానాశ్రయంలో ఉన్నట్టుండి గట్టిగా ఏడ్చేశాను. అప్పుడు నాలో ఏదో సమస్య ఉందని అమ్మకు అర్థమైంది. నాది సాధరణ ఏడుపు కాదని అర్థం చేసుకుంది. వెంటనే ఓ సైకియాట్రిస్ట్‌ను కలవమని సూచించింది. అమ్మ అందించిన సహకారంతో డిప్రెషన్‌ను అధిగమించాను. అదే సమయంలో నాలాంటి బాధితులు ఇంకెంతమంది ఉన్నారో? అని అప్పట్లో నాకనిపించింది. వారిందరికీ ఈ సమస్యపై అవగాహన కల్పించాలనుకున్నాను. లివ్‌, లవ్‌, లాఫ్‌ ఫౌండేషన్‌ అలా పుట్టుకొచ్చినదే. నా ద్వారా ఒక్క ప్రాణాన్ని కాపాడగలిగినా ఈ జీవితానికి సార్థకత ఏర్పడినట్లే ‘ అని ఎమోషనల్‌ అయ్యింది దీపిక.

ఇది కూడా చదవండి..

ఇవి కూడా చదవండి

అటు ‘సమరం’.. ఇటు ‘బేరం’.. తారకరాముడి స్పందనేంటి?.. ‘రజనీతో రామ్’.. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌..