అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. ఈనెల 22న జరిగే బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన వేడుక కోసం దేశ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మహాక్రతువు కోసం శ్రీరామ జన్మభూతి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ చారిత్రక ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి మహా సాధువులు, పండితులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు తరలి రానున్నారు. ఈ మహోత్తర ఘట్టంలో పలువురు సినీ ప్రముఖులు కూడా భాగం కానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి సూపర్ స్టార్స్ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. అలాగే పలువురు బాలీవుడ్ నటీనటులు కూడా పాల్గొననున్నారు. అయితే ఇంతలో ఒక సీనియర్ హీరోకు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ప్రముఖ హిందీ నటుడు జాకీ ష్రాఫ్ తన సింప్లిసిటీని చాటుకున్నారు. సెలబ్రిటీ అన్న స్టేటస్‌ను పక్కన పెట్టి రామాలయ ప్రాంగణాన్ని, మెట్లను శుభ్రం చేశారు. 66 ఏళ్ల జాకీ ష్రాఫ్ ముంబైలో జరిగిన పురాతన రామాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి క్లీనింగ్ స్టాఫ్‌తో కలిసి రామాలయ ప్రాంగణం, మెట్లను శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు జాకీష్రాఫ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది శ్రీరామునిపై అతనికి ఉన్న భక్తిని చాటి చెప్పిందంటూ కొనియాడుతున్నారు.
బాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందిన జాకీష్రాఫ్ తెలుగు వారికి కూడా సుపరిచితమే. పవన్ కల్యాణ్ పంజా, ఎన్టీఆర్ శక్తి, ప్రభాస్ సాహో, అస్త్రం, బ్యాంక్, బ్లాక్ అండ్ వైట్ తదితర సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించారు. తమిళ్, మలయాళ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటారు జాకీ ష్రాఫ్. నిరుపేద చిన్నారుల వైద్యం కోసం పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారీ సీనియర్ హీరో. ఇటీవలే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వానం అందుకున్నారు జాకీష్రాఫ్.
#WATCH | Maharashtra: Amruta Fadnavis wife of Maharashtra Deputy CM Devendra Fadnavis & Bollywood actor Jackie Shroff took part in the cleanliness drive of the oldest Ram temple in Mumbai. (14.01) pic.twitter.com/mhdkzcNB5x
— ANI (@ANI) January 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..