Swara Bhasker: హీరోయిన్ స్వర భాస్కర్‏కు చేదు అనుభవం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ (Swara Bhaskar) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటారు. ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలు..

Swara Bhasker: హీరోయిన్ స్వర భాస్కర్‏కు చేదు అనుభవం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
Swara Bhaskar

Updated on: Mar 24, 2022 | 7:59 PM

బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ (Swara Bhaskar) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటారు. ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలు.. వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటుంది. సినిమాల పరంగా కాకుండా.. స్కర భాస్కర్ వివాదాలోతనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. ఇటీవల హిజాబ్ వివాదం పై షాకింగ్ కామెంట్స్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది స్వర భాస్కర్.. తాజాగా స్వర భాస్కర్ చేసిన పోస్ట్ పై నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఉబెర్ క్యాబ్ డ్రైవర్ తన లగేజీతో పారిపోయాడని.. అందులో తన వస్తువులన్ని ఉన్నాయని తెలిపింది స్వరభాస్కర్.

ఈ విషయాన్ని తెలియజేస్తూ.. స్వర భాస్కర్ ఉబెర్ సంస్థకు ట్వీట్ చేసింది స్వర. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‏లో తాను కొన్ని వస్తువులును కొన్నానని.. ఆ తర్వాత క్యాబ్ బుక్ చేసుకుని.. ప్రీయాడెడ్ స్టాపులో దిగినప్పుడు క్యాబ్ డ్రైవర్ తన వస్తువులవు తీసుకుని వెళ్లిపోయాడంటూ ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేసింది స్వర. “హేయ్ ఉబర్ సపోర్ట్.. లాస్ ఏంజిల్స్ లో మీ కారు డ్రైవర్ ఒకరు నా వస్తువులు తీసుకుని ఉడాయించాడు.. అవి నేను పొగోట్టుకోలేదు.. అతడే దొంగిలించాడు.. దీనిపై మీ యాప్ లో ఎలా ఫిర్యాదు చేయాలో కనిపించడం లేదు.. దయచేసి వాటిని నాకు తిరిగి అప్పగిస్తారా ? ” అంటూ ట్వీట్ చేసింది స్వరా. దీనికి ఉబర్ యాజమాన్యం స్పందిస్తూ ఈ విషయంపై తనకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తామని రిప్లై ఇచ్చింది. అయితే ఆమె చేసిన ట్వీట్ పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి వారు కావాలనే ఇలా కంప్లైంట్ చేస్తారని.. ఉబర్ వీరిని నమ్మవద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే.. ఇలాంటివారికి నిరాధారమైన ఆరోపణలు చేయడం అలవాటు అని.. అమాయక డ్రైవర్స్ పై ఇలా నిందలు వేయడం అలావాటు అని.. తను ఫేక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: కార్తీకదీపం లెక్కలు మారిపోతున్నాయ్‌.. తికమక, సాగతీతతో ప్రేక్షకులలో విసుగు.. చివరకు..

Nithiin: మాచర్ల నియోజకవర్గం మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యేది అప్పుడే..

SSMB 29: మహేష్.. రాజమౌళి సినిమాపై మరోసారి క్లారిటీ ఇచ్చేసిన విజయేంద్రప్రసాద్.. ఇప్పటికే స్టోరీ కంప్లీట్ అంటూ..

RRR: విడుదలకు ముందే ఊచకోత.. ప్రీమియర్స్​లో ‘ఆర్​ఆర్​ఆర్’ కలెక్షన్ల సునామీ.. ఆ రికార్డ్ బ్రేక్’