Parineeti Chopra-Raghav Chadha: ఉదయ్‏పూర్ రాజభవనంలో పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహం.. ఎప్పుడంటే..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో వీరిద్దరు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వీరి ఎంగెజ్మెంట్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ ఏడాది చివరిలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

Parineeti Chopra-Raghav Chadha: ఉదయ్‏పూర్ రాజభవనంలో పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహం.. ఎప్పుడంటే..
Parineeti Chopra

Updated on: Jun 09, 2023 | 3:35 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో వీరిద్దరు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వీరి ఎంగెజ్మెంట్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ ఏడాది చివరిలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడీ జంట పెళ్లి కోసం లొకేషన్ స్కౌటింగ్ మొదలు పెట్టారు. ఇటీవల రాజస్థాన్ విమానాశ్రంయలో పరిణీతి, రాఘవలు వివాహ వేదికను ఫిక్స్ చేయడానికి వివిధ ప్రదేశాలకు వెళ్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. హిందూ సంప్రదాయ పద్దతిలో తమ పెళ్లి జరగాలని కోరుకుంటున్నారు.

కుటుంబ సంప్రదాయాలు, ఆచారాలు రెండు కుటుంబాలలో పెద్ద భాగం. అందుకే సాధ్యమైనంతవరకు తమ పెళ్లిని సాంప్రదాయంగా.. సన్నిహితులు, బంధువుల మధ్య జరగాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వీరి పెళ్లి ఉదయ్ పూర్ రాజభవనంలో జరగనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ అనేక ఫ్రముఖ విలాసవంతమైన హోటళ్లు.. రాజభవనారకు ప్రసిద్ధి. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలకు ఈ ప్రదేశం ఉత్తమ ఎంపిక. కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ జంటలు రాజస్థాన్ లోనే వివాహం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం పరిణీతి, రాఘవ్ ఉదయ్ పూర్ లోని ఒబెరాయ్ ఉదయవిలాస్ లో తమ పెళ్లి జరగాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇది పిచోలా సరస్సు ఒడ్డున ఉంది. పరిణితి చోప్రా సోదరి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోని ఉమైద్ భవన ప్యాలెస్ లో డెస్టినేషన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.