Mandira Bedi’s husband Died: సినీ పరిశ్రమలో మరో విషాదం.. మందిరాబేడీ భర్త రాజ్ కుశల్ మృతి

Mandira Bedi's husband Died: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి.. మాజీ క్రికెట్ కామెంటేటర్ మందిరా బేడీ భర్త ప్రముఖ నిర్మాత రాజ్ కుశల్ గుండెపోటుతో..

Mandira Bedis husband Died:  సినీ పరిశ్రమలో మరో విషాదం.. మందిరాబేడీ భర్త రాజ్ కుశల్ మృతి
Mandiasra Bedi

Updated on: Jun 30, 2021 | 11:37 AM

Mandira Bedi’s husband Died: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి.. మాజీ క్రికెట్ కామెంటేటర్ మందిరా బేడీ భర్త ప్రముఖ నిర్మాత రాజ్ కుశల్ గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. ఈ మరణ వార్తను సన్నిహితులు మరో దర్శకుడు ఓనిర్‌ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సంతాపం తెలిపారు. తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా మై బ్రదర్‌ నిఖిల్‌కు ఓ నిర్మాతగా వ్యవహరించారు. తనను ఎంతో సపోర్ట్‌ చేశారంటూ రాజ్ కుశల్ ను గుర్తు చేసుకున్నారు.

రాజ్ కుమార్ కు బుధ‌వారం తెల్లవారు జామున 4 గంటల 30 నిమిషాల సమయంలో గుండెపోటు రావడంతో మరణించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వైద్యులు వచ్చేసారికే అయన మరణించినట్లు తెలుస్తోంది. రాజ్ కుశల్ మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

పలు సినిమాలను నిర్మించిన రాజ్ కుశల్ ప్యార్ మే క‌బీ క‌బీ, షాదీ కా ల‌డ్డు సినిమాలకు దర్శకత్వం వహించారు. శాంతి సీరియల్ ద్వారా బుల్లి తెరపై నటిగా అడుగు పెట్టిన మందిరా బేడీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక్క కుమారుడు. అలాగే గతేడాది ఓ బాలికను దత్తత తీసుకున్నారు.

Also Read: కోవా, పన్నీర్, రవ్వతో స్వీట్ షాపు రుచిలో కాలా జామున్ తయారీ విధానం