Mandira Bedi: మరచిపోవడానికి అతను జ్ఞాపకం కాదు.. జీవితమే తను.. భర్త పై భావోద్వేగ పోస్ట్ చేసిన సాహో బ్యూటీ..

బాలీవుడ్ నటి మందిరా బేడి స్వాతంత్ర దినోత్సవం రోజున తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. తన భర్త, సినీ దర్శకుడు రాజ్ కౌశల్‏ను గుర్తు

Mandira Bedi: మరచిపోవడానికి అతను జ్ఞాపకం కాదు.. జీవితమే తను.. భర్త పై భావోద్వేగ పోస్ట్ చేసిన సాహో బ్యూటీ..
Mandira

Edited By: Rajeev Rayala

Updated on: Aug 16, 2021 | 10:17 PM

బాలీవుడ్ నటి మందిరా బేడి స్వాతంత్ర దినోత్సవం రోజున తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. తన భర్త, సినీ దర్శకుడు రాజ్ కౌశల్‏ను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ ఈ ఏడాది జూన్ 30న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నిన్న (ఆగస్ట్ 15న) రాజ్ కౌశల్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయనను గుర్తుచేసుకుంటూ వారిద్దరూ కలిసున్న ఫోటోను షేర్ చేస్తూ.. భావోద్వేగ పోస్ట్ చేసింది. ఆగస్ట్ 15 ప్రతి ఏడాది ఓ వేడుకల అంటుంది. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం.. ఈరోజున రాజ్ బర్త్ డే కూడా. హ్యాపీ బర్త్ డే రాజీ.. మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నీవు మమ్మల్ని చూస్తున్నావవి ఆశిస్తున్నాను. నీవు లేని ఈ శూన్యత ఎన్నటికీ పూరించలేం. నీవు మరచిపోవడానికి జ్ఞాపకం కాదు. మా జీవతం అంటూ ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు.

రాజ్ కౌశల్, మందిరా బేడి 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2011లో కొడుకు వీర్ జన్మించాడు. అనంతరం ఈ జంట తార అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. రాజ్ కౌశల్ మై బ్రదర్‌ నిఖిల్‌, ప్యార్‌ మే కభీ కభీ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. 800పైగా యాడ్స్‏కు ప్రొడ్యూసర్‏గా చేశారు. మందిరా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఇక భర్త అంత్యక్రియల సమయంలో మందిరాను నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. విషాదంలోనూ తన డ్రెస్సింగ్ పై కొందరు ఆకతాయిలు ఇష్టానుసారంగా కామెంట్స్ చేశారు.

Also Read: Ram Charan: జాతీయ జెండాకు అవమానం.. చెర్రీని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఇంతకీ ఎం జరిగిందంటే ?

Indian Idol 12 winner: ఇండియన్ ఐడల్ 12 గ్రాండ్ ఫినాలే విన్నర్‌‌గా సింగర్ పవన్‌దీప్ రాజన్.. ఆరో స్థానంలో షణ్ముఖ ప్రియ..

Prabhas Movie: ప్రభాస్ మూవీకి ఆరెస్సెస్ సెగ? అందుకే ఎలర్ట్ అయ్యారా?