బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథానాయికలలో కృతి సనన్ ఒకరు (Kriti Sanon). అతి తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంలోనూ నటిస్తుంది. డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా కృతి సనన్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన పెళ్లి స్వయంవరంలో హీరోస్ కార్తీక్ ఆర్యన్, ఆదిత్య రాయ్ కపూర్, సౌత్ హీరో విజయ్ దేవరకొండ (VIjay Deverakonda) ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అంతేకాకుండా విజయ్ అందంగా ఉంటాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కృతి సనన్ మాట్లాడుతూ.. ” విజయ్ దేవరకొండ చూడటానికి చాలా అందంగా ఉంటాడు. అతను చాలా సెన్సిబుల్‌గా ఉన్నాడు. ఇటీవల అతని ఇంటర్వ్యూలో చాలా చూశాను. అతను ఎంతో నిజాయితీగా..సెన్సిటివ్‌గా కనిపిస్తున్నాడు. నా స్వయంవరంలో అతను ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే కార్తీక్ ఆర్యన్, ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఉండాలి. అంతేకాకుండా ఇప్పటికీ పెళ్లి కాకుండ ఒంటరిగా ఉన్నవారు స్వయంవరంలో పాల్గొనవచ్చు. అలాగే నేను ర్యాన్ గోస్లింగ్ తో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాను. అతను కూడా నా స్వయంవరంలో ఉండాలనుకుంటాను. ” అంటూ చెప్పుకొచ్చింది. 2014లో హీరో టైగర్ ష్రాఫ్ నటించిన హీరోపంతి చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందిృ కృతి. ప్రస్తుతం ఈ హీరోయిన్ భేదియా, గణపథ్, ఆదిపురుష్, షెవజాదా చిత్రాల్లో నచిస్తుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.