Janhvi Kapoor: జాన్వీ కపూర్ చేతికి గాయం.. గర్వం పనికిరాదంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది జాన్వీ.. దడక్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ అతి తక్కువ సమయంలోనే వరుస సూపర్ హిట్ చిత్రాలను చేస్తూ..అందం.. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అటు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది జాన్వీ.
తాజాగా విమానాశ్రయం నుంచి బయటకు వస్తూ కెమెరాలకు చిక్కింది జాన్వీ. ఆమె చేతికి గాయం అయి.. కట్టుతో కనిపించింది. దీంతో ఆమె చేతికి గాయం ఎలా అయ్యిందని.. ఎందుకు అంతపెద్ద కట్టు ధరించాల్సి వచ్చిందని అక్కడే విలేకర్లు ప్రశ్నించగా.. జాన్వీ కపూర్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయింది. దీంతో జాన్వీ కపూర్ ప్రవర్తనపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన సరైనది కాదంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంత గర్వం ఉండకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ట్వీట్..
View this post on Instagram
జాన్వీ కపూర్ ఇలా ట్రోల్స్‌కు గురికావడం మొదటి సారి కాదు..గతంలోనూ తన ప్రవర్తనతో అనేకసార్లు ట్రోల్స్ జరిగాయి. ఇటీవల జాన్వీ కపూర్ తన సొదరి, స్నేహితులతో కలిసి ఎక్కడికో వెళ్లి వస్తూ కెమెరాలకు చిక్కింది. జాన్వీని ఫోటోలకు ఫోజులివ్వమని ఫోటోగ్రాఫర్లు అడగ్గా.. పట్టించుకోకుండా వెళ్లి కారులో కూర్చుంది. దీంతో మేడమ్ యాటిట్యూడ్ చూడండి అంటూ కామెంట్స్ చేశారు.
Also Read: Samantha: హీరోయిన్ సమంతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స..
Rashmika Mandanna: ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డానన్న నేషనల్ క్రష్ రష్మిక.. ఇంతకు ఏమైందంటే..
Miss Universe : ఇప్పటివరకు ఇండియా తరపున విశ్వ సుందరి పోటీలో పాల్గొన్న భామలు వీరే..