AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: ఫేక్ కలెక్షన్స్.. జనాలను పిచ్చొళ్లను చేస్తున్నారు.. అలియా సినిమాపై నిర్మాత సతీమణి ఫైర్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన లేటేస్ట్ మూవీ 'జిగ్రా' అక్టోబర్ 11న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తుండగా, ఇప్పుడు 'టి సిరీస్'నిర్మాణ సంస్థ అధినేత భూషణ్ కుమార్ భార్య నటి దివ్య ఖోస్లా కుమార్ అలియా సినిమాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. అలియా నటింటిన 'జిగ్రా' కథ గతంలో తాను నటించిన 'సావి' సినిమా తరహాలోనే ఉంటుందని ఆమె పేర్కొంది.

Alia Bhatt: ఫేక్ కలెక్షన్స్.. జనాలను పిచ్చొళ్లను చేస్తున్నారు.. అలియా సినిమాపై నిర్మాత సతీమణి ఫైర్..
Divya Khossla, Alia Bhatt
Rajitha Chanti
|

Updated on: Oct 13, 2024 | 10:01 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన లేటేస్ట్ మూవీ ‘జిగ్రా’ అక్టోబర్ 11న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తుండగా, ఇప్పుడు ‘టి సిరీస్’నిర్మాణ సంస్థ అధినేత భూషణ్ కుమార్ భార్య నటి దివ్య ఖోస్లా కుమార్ అలియా సినిమాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. అలియా నటింటిన ‘జిగ్రా’ కథ గతంలో తాను నటించిన ‘సావి’ సినిమా తరహాలోనే ఉంటుందని ఆమె పేర్కొంది. అంతేకాదు, అలియా జిగ్రా మూవీ గురించి ఫేక్ కలెక్షన్‌ను చూపిస్తుందని ఆమె ఆరోపణలు చేసింది. దివ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో థియేటర్లో అలియా సినిమాను చూస్తున్న ఫోటోను పంచుకుంది. అందులో థియేటర్ మొత్తం ఖాలీగా కనిపిస్తుంది. అలియా నటించిన ‘జిగ్రా’ సినిమా చూడటానికి ఎవరూ థియేటర్‌కి వెళ్లనప్పటికీ, నటి ఫేక్ కలెక్షన్ లెక్కలను ప్రకటిస్తున్నారని దివ్య ఆరోపించింది.

“జిగ్రా సినిమా చూసేందుకు సిటీ మాల్‌లోని పీవీఆర్‌కి వెళ్లాను.. అక్కడ థియేటర్ పూర్తిగా ఖాళీగా ఉంది. మిగతా చోట్ల కూడా ఈ షోలకు థియేటర్లు పూర్తిగా ఖాళీ అయ్యాయి. అలియా భట్ నిజంగా మీలో చాలా ధైర్యం ఉంది ఇలా ఫేక్ కలెక్షన్స్ చూపించడానికి. మీరే స్వయంగా టికెట్స్ కొనుగోలు చేసి నకిలీ వసూళ్లను ప్రకటిస్తున్నారు. ఇప్పుడు పెయిడ్ మీడియా ఎందుకు సైలెంట్ గా ఉందో ఆశ్చర్యంగా ఉంది” అంటూ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది దివ్య.

అంతుక ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్య మాట్లాడుతూ.. “సావి, జిగ్రా రెండు చిత్రాలు అన్ని విధాలుగా ఒకేలా ఉన్నాయి. ప్రేక్షకుల ప్రేమతో, భగవంతుని దయతో ఈ చిత్రం సావి తన ప్రతిభతో నిరూపించుకుందని మాత్రమే చెబుతాను. ఈ చిత్రం థియేటర్లలో, ఓటీటీలో మంచి వసూళ్లను సాధించింది. చాలా దేశాల్లో అగ్రస్థానంలో ఉన్నాం. జిగ్రా సినిమా సావి లాంటిదే అయినా, ప్రతి సినిమాకు తనదైన ప్రయాణం ఉంటుందని భావిస్తున్నాను. కొన్నిసార్లు రెండు నిర్మాణ సంస్థలు ఒకే కథపై సినిమా తీయవచ్చు.” అంటూ చెప్పుకొచ్చింది. అలియా భట్, వేదంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగ్రా’. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్య పాత్రలో ఆలియా నటిస్తోంది. ఇది ఆగ్నేయాసియా దేశంలో అరెస్టయిన తర్వాత తన సోదరుడిని జైలు నుండి బయటకు తీసుకురావడానికి తన జీవితాంతం పోరాడే సోదరి (సత్య) కథ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్