Alia Bhatt: ‘ఇక చాలు.. మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు’.. వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అలియా..
గతంలో విరాట్- కోహ్లీ కుమార్తె వామిక ఫొటోలను తీసేందుకు వారి ఇంట్లోకి ఫొటోగ్రాఫర్లు చొరబడి దొరికిపోయారు. ఇక ఇప్పుడు హీరోయిన్.. అలియా రణబీర్ దంపతులకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది.

సాధారణంగా సినీ తారల గురించి తెలుసుకునేందుకు నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. సినిమాల్లో కాకుండా.. వారి వ్యక్తిగత విషయాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. అలాగే వారి పెళ్లి , పిల్లలకు సంబంధించిన ఫోటోస్.. వీడియోస్ తీసేందుకు ప్రయత్నిస్తుంటారు. పబ్లిక్ ఏరియాలలో కాకుండా.. ఇంట్లో ఎలా ఉంటారు ? అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇ ప్రేక్షకుల మనసులు తెలుసుకున్న కొందరు ఫొటోగ్రాఫర్లు ఎలా అయినా వారి ఫొటోలను పోస్ట్ చేసి సంపాదించాలనుకుంటారు. మరికొందరు లైక్స్, షేర్ల కోసం రిస్క్ చేసి మరీ ప్రముఖుల ఇంటి విషయాలను బయటపెడుతుంటారు. గతంలో విరాట్- కోహ్లీ కుమార్తె వామిక ఫొటోలను తీసేందుకు వారి ఇంట్లోకి ఫొటోగ్రాఫర్లు చొరబడి దొరికిపోయారు. ఇక ఇప్పుడు హీరోయిన్.. అలియా రణబీర్ దంపతులకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది అలియా.
గతేడాది బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కుటుంబసభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన కొన్ని నెలలకే ఆలియా ప్రెగ్నెంట్ అని ప్రకటించి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత నవంబరులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమ గారాలపట్టికి ఆ జంట రాహా కపూర్ అని పేరు పెట్టింది. కానీ ఇంతవరకు ఆమె ముఖాన్ని అభిమానులకు చూపించలేదు. మరో రెండేళ్ల వరకు చూపించమని కూడా ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో వారి ముద్దుల కూతురి ఫోటోస్ ఎలాగైనా సంపాదించాలనుకున్నా ఇద్దరు ఫొటోగ్రాఫర్లు.. ఆలియా ఇంట్లో సీక్రెట్ కెమెరాను పెట్టేశారు. ఈ విషయాన్ని ఆలియా గమనించింది. వారిద్దరికి గట్టి షాక్ కూడా ఇచ్చింది.




తాజాగా ఆలియా.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “నేను మా ఇంట్లో ఎంతో సరదాగా గడుపుతున్నాను. ఆ సమయంలో నన్ను ఎవరో గమనిస్తున్నట్లు అనిపించింది. వెంటనే వారు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించి షాకయ్యారు. మా పక్కింటి టెర్రస్‌పై ఇద్దరు వ్యక్తులు చేతిలో కెమెరాలు పట్టుకొని మా ఇంట్లోకి చూస్తున్నారు. ఇది సరైనది కాదు.. మీరు మా ప్రైవసీకి భంగం కలిగించడమే.. ఒకరి వ్యక్తిగత విషయాలపై గోప్యత పాటించరా ?. ఎలాంటి వారి మధ్య అయినా దాటకూడని గీత ఉంటుంది. ఇక చాలు.. మీరు లిమిట్ క్రాస్ చేశారు.. నా ఇంట్లోకి కెమెరాలు పెడతారా..?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Alia
అంతే కాకుండా ఆ పోస్ట్‌కు ముంబయి పోలీసులకు ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఆలియా పోస్ట్ వైరల్‌గా మారింది. కొందరు సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఇలా చేయడం చాలా తప్పు అని అంటున్నారు. కచ్చితంగా పోలీసులు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.