24 February 2025

సింప్లిసిటికీ కేరాఫ్ అడ్రస్.. నాని ఆస్తులు ఎంతో తెలుసా..

Rajitha Chanti

Pic credit - Instagram

న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. అష్టాచెమ్మా సినిమాతో హీరోగా సినీప్రయాణం స్టార్ట్ చేశాడు నాని.

జెర్సీ, శ్యామ్ సింగరాయ్, దసరా, హాయ్ నాన్న వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఫిబ్రవరి 24 నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సెలబ్రెటీలు విషెస్ తెలుపుతున్నారు. 

చివరిసారిగా హాయ్ నాన్న సినిమాలో కనిపించిన నాని.. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో 'HIT 3' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నాని కెరీర్ లో మరో పాన్ ఇండియా సినిమా ఇది. 

 ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాని ఒక్క సినిమాకు దాదాపు రూ.30 నుంచి రూ.40 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. 

అలాగే ప్రస్తుతం నాని ఆస్తులు రూ.150 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అంతేకాకుండా నాని వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయట. 

అలాగే ప్రస్తుతం నాని ఆస్తులు రూ.150 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అంతేకాకుండా నాని వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయట.