జామ పండు.. యాపిల్.. ఆరోగ్యానికి ఏది మంచిది?
మంచి ఆరోగ్యం కోసం పండ్లను ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తుంటారు. కొన్ని రకాల పండ్లపై చాలామందిని పలు అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా జామ పండ్లు, యాపిల్స్ విషయంలో విభిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో జామ పండ్లు, యాపిల్స్ లో ఏవి ఆరోగ్యకరం, ఎందుకు, ఎవరెవరికి ఏ పండ్లు అయితే మంచిదో నిపుణులు సూచిస్తున్నారు.
జామ పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. మన శరీరానికి ఒక రోజులో అవసరమైన విటమిన్ సీ కంటే… ఒక జామ పండులో రెండింతల విటమిన్ సీ ఉంటుంది. ఇది మనలో ఇమ్యూనిటీని పెంచేందుకు, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు, శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. యాపిల్ లో విటమిన్ సీ మోతాదు తక్కువే. మనకు ఒక రోజులో అవసరమయ్యే విటమిన్ సీ లో ఒక యాపిల్ నుంచి కేవలం 14 శాతం మాత్రమే అందుతుందని నిపుణులు చెబుతున్నారు. యాపిల్స్ లో పెక్టిన్ గా పిలిచే ఉపయోగకరమైన ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుంది. ఒక జామ పండులో 3 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉంటుంది. కానీ దీనిలో ఇన్ సాల్యుబుల్, సాల్యుబుల్ అనే రెండు రకాల ఫైబర్ లు ఉంటాయి. అందువల్ల జీర్ణ వ్యవస్థకు మరింత ఎక్కువ మేలు అని నిపుణులు చెబుతున్నారు. కేలరీల పరంగా చూసుకుంటే.. ఒక సాధారణ యాపిల్ లో సుమారు 95 కేలరీల శక్తి ఉంటే… జామ పండులో 68 కేలరీలు మాత్రమే ఉంటాయి. నిజానికి రెండింటి నుంచి వచ్చే కేలరీలు తక్కువే అయినా… బరువు తగ్గాలనుకునేవారికి జామ పండ్లు బెటర్ అంటున్నారు. యాపిల్ కన్నా జామ పండ్లలో ప్రోటీన్లు ఎక్కువ. ఒక యాపిల్ నుంచి ఒక గ్రాము ప్రోటీన్ అందితే… జామ పండులో 2.6 గ్రాముల ప్రొటీన్ అందుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తన డ్రాయింగ్‌తో హంతకుడిని పట్టించిన నాలుగేళ్ల చిన్నారి
కొబ్బరి చిప్పలతో 100 రకాల.. గృహాలంకరణ వస్తువులు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు
ఆ నదిలో బురదను పిసికితే బంగారం దొరుకుతుంది.. బకెట్లతో తోడిపోస్తున్న ప్రజలు

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
