తన డ్రాయింగ్‌తో హంతకుడిని పట్టించిన నాలుగేళ్ల చిన్నారి
నాలుగేళ్ల చిన్నారి డ్రాయింగ్ వేసి చూపించి తన తల్లిని చంపిన వ్యక్తిని చూపించింది. అతడు మరెవరో కాదు.. ఆమె తండ్రే. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని కొత్వాలి, శివ్ పరివార్ కాలనీలో 27 ఏళ్ల వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నాలుగేళ్ల చిన్నారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఝాన్సీకి చెందిన సందీప్ బుధోలియాతో 2019లో సదరు మహిళకు వివాహమైంది. ఆ సమయంలో రూ. 20 లక్షల నగదు, ఇతర లాంఛనాలను కట్నంగా ఇచ్చినట్టు మృతురాలి తండ్రి సంజీవ్ త్రిపాఠి తెలిపారు. అయితే, పెళ్లయిన కొన్ని నెలల నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించేవారని ఆరోపించారు. ఇంటి నుంచి డబ్బులు తీసుకురాకపోవడంతో ఆమెను శారీరకంగా, మానసికంగా చిత్రవధ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం పోలీస్ స్టేషన్‌కు చేరడంతో ఇరు కుటుంబాలు రాజీపడ్డాయి. ఆ తర్వాత వారికి పాప పుట్టింది. అయినా గొడవలు మాత్రం ఆగలేదు. అబ్బాయి పుట్టలేదంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె అత్తగారింట్లో ఉరికి వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని విచారించారు. ఈ క్రమంలో బాధితురాలి నాలుగేళ్ల కుమార్తెను కూడా విచారించారు. ఆ చిన్నారి వాంగ్మూలం ఇవ్వడంతో పాటు తల్లిని తన తండ్రి ఎలా చంపిందీ డ్రాయింగ్ వేసి చూపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొబ్బరి చిప్పలతో 100 రకాల.. గృహాలంకరణ వస్తువులు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు
ఆ నదిలో బురదను పిసికితే బంగారం దొరుకుతుంది.. బకెట్లతో తోడిపోస్తున్న ప్రజలు
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

