ఆ నదిలో బురదను పిసికితే బంగారం దొరుకుతుంది.. బకెట్లతో తోడిపోస్తున్న ప్రజలు
ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అనేక ప్రాంతాల్లో బంగారం కోసం అన్వేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. గోల్డ్ మైన్స్‌పై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తుంటాయి. పాకిస్థాన్‌లో కూడా ఓ ప్రాంతంలో బంగారం నిల్వలు ఉన్నాయనే అనుమానంతో ప్రజలు పెద్ద ఎత్తున వెతికే పనిలో ఉన్నారు.
పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం అక్కడి ప్రజలు రోజంతా నదీ గర్భం నుంచి బురదను బయటకు తోడిపోసే పనిలో ఉన్నారట. బురదతో నిండిన బకెట్లను ఇంటికి తీసుకెళ్లి ఆ బుదరలో బంగారాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కుండ్ నుండి నిజాంపూర్ వరకు ఉన్న నౌషేరా జిల్లా మొత్తం సింధు నదిని ఆనుకుని ఉంటుంది. నదీ జలాలు కాబూల్ నుండి బురద ప్రవాహాలతో కలిసిపోతాయి. అక్క ఒకప్పుడు పెద్ద ఎత్తున గోల్డ్ మైనింగ్ జరిగింది. నౌషేరాను పంజాబ్‌లోని అటాక్‌తో కలిపే బ్రిటీష్ కాలం నాటి రైల్వే వంతెన వరకు కుండ్ నుండి నది ఒడ్డున ఎక్స్‌కవేటర్లు ఉన్నాయి. ఇక్కడే బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లో నివసిస్తున్న పంజాబ్ మాజీ గనులు, ఖనిజాల మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్, జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ నివేదిక ఆధారంగా అటాక్ సమీపంలో 800 బిలియన్ రూపాయల విలువైన బంగారు నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మొదట్లో చిన్న స్థాయిలో మైనింగ్ కార్యకలాపాలు జరిగాయి. ఆనోటా ఈనోటా పాకడంతో ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి బకెట్లు పట్టుకుని క్యూ కడుతున్నారు. బకెట్ల నిండా నదీ బురదను తోడ్కొని వెళుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆదిమజాతి బాలుడిని ఎప్పుడైనా చూశారా? లైటర్ ఇస్తే ఏం చేశాడో తెలుసా..?
ఆ మహిళ ఇంటి తలుపు తట్టిన కలెక్టర్… ఏం చేశాడో చూడండి
ప్రభాస్ చేతిలో… త్రివిక్రమ్ పెద్ద కొడుకు
చై – శోభితల మనసు బంగారం.. ఎంత మంచి పని చేశారో
Manchu Lakshmi: భర్తతో దూరంగా ఉంటున్నారు ఎందుకు? మంచు లక్ష్మీ షాకింగ్ ఆన్సర్

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
