ప్రేక్షకుడికి రూ. 1.28 లక్షల నష్టపరిహారం పీవీఆర్ కు జరిమానా
బెంగుళూరులోని వినియోగదారుల కోర్టు.. పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ థియేటర్ ఓనర్‌కు భారీ జరిమానా విధించింది. నిర్దేశిత సమయానికి చిత్రాన్ని ప్రదర్శించకుండా.. సుమారు 25 నిమిషాల పాటు యాడ్స్‌ను ప్రదర్శించారని, దాంతో తన విలువైన సమయం వృధా అయినట్లు ఓ సినీ ప్రేక్షకుడు దాఖలు చేసిన కేసులో కన్‌జ్యూమర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
టికెట్‌పై ఉన్న స్క్రీనింగ్ టైమ్‌కే సినిమాను స్టార్ట్ చేయాలని, ఆలస్యం చేసినందుకు జరిమానా కట్టాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. బెంగుళూరుకు చెందిన 30 ఏళ్ల అభిషేక్ ఎంఆర్ అనే వ్యక్తి 2023 డిసెంబర్‌లో సినిమాకు వెళ్లాడు. సామ్ బహదూర్ చిత్రాన్ని చూసేందుకు మరో ఇద్దరితో కలిసి పీవీఆర్‌కు వెళ్లాడు. ఆ ఫిల్మ్ 4.05 నిమిషాలకు ప్రారంభమై.. 6.30 నిమిషాలకు పూర్తి కావాల్సి ఉంది. సినిమా ముగిసిన తర్వాత అతను మళ్లీ వర్క్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ ఆ రోజు చిత్రాన్ని 4.30 నిమిషాలకు ప్రారంభించారు. యాడ్స్, ట్రైలర్స్‌తో ఆలస్యం చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు సినిమా ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో సినిమా పూర్తి కావడానికి కూడా మరింత సమయం పట్టింది. సినిమా ఆలస్యంగా స్ట్రీమింగ్ చేయడం వల్ల తన అపాయింట్‌మెంట్ షెడ్యూల్‌ను మిస్సైనట్లు ఫిర్యాదులో ఆ వ్యక్తి అన్నాడు. ఈ కేసులో ఫిబ్రవరి 15వ తేదీన కన్జ్యూమర్ కోర్టు ఆదేశాలు ఇస్తూ.. ఇతరుల సమయాన్ని వృధా చేస్తూ లబ్ధి పొందే హక్కు ఎవరికీ లేదని తెలిపింది. 25 నుంచి 30 నిమిషాల పాటు థియేటర్‌లో ఖాళీగా కూర్చోవడం సరికాదు అని కోర్టు తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వారానికి రెండు రోజులు ఉపవాసం చేసి చూడండి.. మిమ్మల్ని మీరే నమ్మలేరు
IT రిటర్న్‌లు ఆలస్యమైతే రిఫండ్ రాదా ??
కీళ్లనొప్పులు వేధిస్తున్నాయా.. జుట్టు విపరీతంగా రాలిపోతుందా..!

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్‌కి ఎవరైనా అదరహో అనాల్సిందే
