హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు వీడియో
ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. మే 4 నుంచి 31 వరకు జరిగే ఈ పోటీల్లో గ్రాండ్ ఫినాలే సహా ప్రారంభ, ముగింపు వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇతర ఈవెంట్లు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు పోటీల నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపుతో పాటు చారిత్రక, గ్రామీణ ప్రాంతాల ప్రత్యేకతల్ని వివరించడంతో ఇక్కడ నిర్వహించేందుకు అవకాశం లభించింది.
తెలంగాణ పదేళ్లుగా వేగంగా అభివృద్ది చెందుతోంది. ఇప్పుడు అందాల సుందరి పోటీలకు వేదిక అవుతోంది. రాష్ట్రంలో మేలైన మౌలిక సదుపాయాలు ఉండగా.. శంషాబాద్ విమానాశ్రయం ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటి. ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు అనేకం ఇక్కడ ఉన్నాయి. గ్లోబల్ ఫార్మాసూటికల్ హబ్‌గా కూడా పేరొందింది. ఈ అంశాలు పోటీల నిర్వహణ అవకాశాన్ని అందించాయి. లండన్ వేదికగా ఉన్న ‘మిస్ వరల్డ్’ సంస్థ తెలంగాణ పర్యాటక శాఖతో కలిసి ఈ పోటీలను నిర్వహించనుంది. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించనున్నట్లు మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్, సీఈవో జూలియా మోర్లీ.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌తో కలిసి ఒక ప్రకటనలో తెలిపారు.

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
