కియారాకి ఆ మూవీ కోసం భారీ పారితోషకం.!
24 February 2025
Prudvi Battula
సినిమా రంగంలో బాగా కష్టపడి క్రేజ్ తెచ్చుకుంటే చాలు... ఆ తర్వాత ఆ క్రేజే, గట్టిగా సంపాదించి పెడుతుంది.
ఇప్పుడు హీరోయిన్ కియారా అద్వానీ విషయంలో కూడా అదే జరుగుతోంది. డాన్3లో నాయికగా నటిస్తున్నారు ఈ బ్యూటీ.
ఈ సినిమాలో నటించడం కోసం ఈ బ్యూటీ 13 కోట్లు డిమాండ్ చేస్తే, ఇవ్వడానికి మూవీ మేకర్స్ కూడా ఒప్పుకున్నారట.
ఇప్పటిదాకా ఆమె కెరీర్‌లో అందుకుంటున్న భారీ చెక్ ఇదే. ఈ విషయాన్ని తలచుకుని హ్యాపీగా ఉన్నారు కియారా అద్వానీ.
ఇదిలా ఉంటె తాజాగా డాన్ త్రీక్వెల్ గురించి, తన ఇష్టాయిష్టాల గురించి మాట్లాడారు గేమ్ చేంజర్ గర్ల్.
ప్రతిదీ వైవిధ్యంగా చేయాలనుకుంటాను. నాకు నేను కొత్తగా కనిపించాలనుకుంటాను. డాన్ గర్ల్ గా మెప్పించాలన్నది నా చిరకాల కల.
ఇప్పటిదాకా నేను కనిపించిన తీరు వేరు. నటిగా ఎప్పటికప్పుడు కొత్త పాత్రలను, జోనర్లను ట్రై చేయాలని అన్నారు.
నేను చేసి సినిమాలకు జనాలతో శభాష్ అనిపించుకోవాలి అని అన్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
శంకర్ ఏం చేస్తాడబ్బా.. దిగ్గజ దర్శకుడికి అష్ట దిగ్భంధనం..!
సైడ్ సైడ్ ప్లీజ్.. అప్కమింగ్ హీరోయిన్స్ వచ్చేస్తున్నారండహో..!
బాబోయ్ ఏంటీ కలెక్షన్లు.. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్లే బెటరా..?