Adah Sharma: ఆ ఒక్క విషయంలో చాలా భయపడ్డా.. ఆసక్తికర విషయం తెలిపిన అదాశర్మ
అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ది కేరళ స్టోరీ. ఈ చిత్రానికి డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆదా శర్మ. ఈ సినిమాతో అందం, అభినయంతో కట్టిపడేసింది. అయితే ఈ మూవీ తర్వాత ఆమెకు అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆదా.. హిందీలోనూ నటించి మెప్పించింది. ఇప్పుడు అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ది కేరళ స్టోరీ. ఈ చిత్రానికి డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూల్ చేసింది ఈ సినిమా. అలాగే పలు వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా మారింది.
ఇప్పటికే ఈ సినిమా పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇస్లాం మతంలోకి మారడానికి, ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో చేరేందుకు ట్రాప్ అయిన షాలిని ఉన్నికృష్ణన్ అనే మహిళ పాత్రలో అదా శర్మ నటించింది. అద్భుత నటనతో అదా అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా అదాశర్మ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా చేసిన తర్వాత తన బామ్మ ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడ్డా అని అన్నారు. ఈ సినిమాలో అత్యాచార ప్రయత్నాలు, హింసాత్మక సీన్లను చూసిన తర్వాత ఆమె ఎలా స్పందిస్తుందనే దాని గురించి మాత్రమే ఆందోళన ఉంది. కానీ 90 ఏళ్ల మా బామ్మ చాలా స్ట్రాంగ్. ఆమె సినిమా చూసి మెచ్చుకున్నారు. వాస్తవ సమాచారాన్ని చెప్పే చిత్రంగా పేర్కొన్నారు అని తెలిపారు అదా.
