బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) పై ఓ వ్యక్తి షాకింగ్ కామెంట్స్ చేశాడు. గత కొద్ది రోజుల క్రితం కేతన కక్కడ్ అనే వ్యక్తి ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఫాంహౌస్ లో సెలబ్రెటీల శవాలను ఖననం చేశారని.. అంతేకాకుండా.. అక్కడ మానవ అక్రమ రవాణా కూడా జరుగుతుందంటూ ఆరోపించాడు. అలాగే సల్మాన్ డి గ్యాంగ్‌కు ఫ్రంట్ అంటూ ఆరోపించారు. దీంతో తనపై ఆరోపణలు చేసిన వ్యక్తిపై సల్మాన్ ఖాన్ పరువు నష్టం దావా వేశాడు.
సల్మాన్ తరపు న్యాయవాది స్పందిస్తూ సరైన రుజువులు లేకుండా.. తనపై ఆరోపణలు చేస్తున్నాడని..తనతో ఆస్తి వివాదం ఉందని.. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత ప్రతిష్టను మంటగలిపెందుంకు అతడు ఇలా అసత్య ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు. అలాగే తన తల్లి హిందువు అని.. తండ్రి ముస్లిం అని.. తన సోదరులు హిందువులను వివాహం చేసుకున్నారని.. తాము అన్ని పండుగలను జరుపుకుంటామని సల్మాన్ తెలిపారు. సల్మాన్ ఖాన్ పన్వేల్ ఫాంహౌస్ సమీపంలోనే ఆస్తిని కలిగి ఉన్న నాన్ రెసిడెంట్ ఇండియన్ (NRI).. మరికొందరిపై సల్మాన్.. అతని కుటుంబసభ్యులు పరువు నష్టం దావా వేశారు. కేతన్ కక్కడ్ చేసిన ఆరోపణలను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని సల్మాన్ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
Also Read: BhamaKalapam Teaser: బాబోయ్ ఈ భామ చాలా డేంజర్ సుమా..! ఆసక్తికరంగా భామా కలాపం టీజర్..
Shruti Haasan: ప్రభాస్ అందరూ అనుకునేలా కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అందాల శ్రుతిహాసన్..
Sreeleela : క్రేజ్ పెరిగింది రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.. భారీగా డిమాండ్ చేస్తుందట శ్రీలీల..
Raashi Khanna: టాలీవుడ్ అలా బాలీవుడ్ మాత్రం ఇలా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ..