Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలకు మీరిచ్చే గౌరవమిదేనా ? ఐష్‌పై పాక్‌ క్రికెటర్‌ అసభ్యకర కామెంట్స్‌.. నవ్వుతూ చప్పట్లు కొట్టిన అఫ్రిదీ

బాబర్ కెప్టెన్సీపై ఇతర ఆటగాళ్ల ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై ఒక టీవీ చర్చలో మాట్లాడిన పాక్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌ దీనికి ఏ మాత్రం సంబంధం లేని ఐశ్వర్యారాయ్‌ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమెపై అసభ్యకర కామెంట్లు చేశాడు. ఇక రజాక్‌ వ్యాఖ్యలకు వంత పాడుతూ అతని పక్కనే ఉన్న షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్, సయీద్ అజ్మల్ అయితే నవ్వుతూ మరీ చప్పట్లు కొట్టారు

మహిళలకు మీరిచ్చే గౌరవమిదేనా ? ఐష్‌పై పాక్‌ క్రికెటర్‌ అసభ్యకర కామెంట్స్‌.. నవ్వుతూ చప్పట్లు కొట్టిన అఫ్రిదీ
Pakistan Cricketers, Aishwarya Rai
Follow us
Basha Shek

|

Updated on: Nov 15, 2023 | 8:03 AM

2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనతో ఇంటి దారి పట్టింది. బాబర్ అజామ్ సారథ్యంలోని ఆ జట్టు కనీసం సెమీ ఫైనల్‌కు కూడా అర్హత సాధించలేక ఐదో స్థానంలో నిలిచింది. ఆ జట్టు 9 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ వంటి చేతిలో కూడా ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.  బాబర్ సేన వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓడిపోవడమే కాకుండా ప్రపంచకప్ చరిత్రలో 5 మ్యాచ్‌ల్లో ఓడిన తొలి పాక్ జట్టుగా నిలిచింది.  దీంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాబర్ కెప్టెన్సీపై ఇతర ఆటగాళ్ల ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై ఒక టీవీ చర్చలో మాట్లాడిన పాక్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌ దీనికి ఏ మాత్రం సంబంధం లేని ఐశ్వర్యారాయ్‌ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమెపై అసభ్యకర కామెంట్లు చేశాడు. ఇక రజాక్‌ వ్యాఖ్యలకు వంత పాడుతూ అతని పక్కనే ఉన్న షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్, సయీద్ అజ్మల్ అయితే నవ్వుతూ మరీ చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పాక్‌ క్రికెటర్ల దిగజారుడుతనానికి ఇది మరో నిదర్శనం అంటూ అభిమానులు, నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇంతకీ రజాక్‌ ఏమన్నాడంటే?.

‘మంచి ఆటగాళ్లను తయారుచేయాలని కానీ, పాక్‌లో క్రికెట్‌ను మెరుగుపర్చాలని కానీ పాకిస్తాన్ బోర్డుకు ఏ మాత్రం లేదు. అసలు పాక్ బోర్డుకు సంకల్ప బలమే లేదు. అలాంటప్పుడు మంచి ఫలితాలు ఎలా వస్తాయి? ‘ అని చెప్పుకొచ్చిన అబ్దుల్ రజాక్ అనవసరంగా  ఐశ్వర్య రాయ్‌ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమెపై అసభ్యకరంగా కామెంట్లు చేశాడు.  అతని మాటలకు పక్కనే ఉన్న షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్, సయీద్ అజ్మల్ వంటి పాక్ మాజీ ఆటగాళ్లు కూడా నవ్వుతూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ లో ఉన్న జర్నలిస్టులు కూడా రజాక్ కామెంట్స్ కు పగలబడి నవ్వడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. పాక్‌ క్రికెటర్ల తీరును అందరూ తప్పుపడుతున్నారు. మహిళలకు మీరిచ్చే గౌరవమిదేనా? ప్రొఫెషనల్ క్రికెటర్లు అయి ఉండి ఇలాంటి థర్డ్‌ క్లాస్‌ స్టేట్‌మెంట్స్‌ ఇవ్వడం దారుణం. పక్కన అఫ్రీదీ సిగ్గు లేకుండా నవ్వడం చూస్తుంటే మీరు ఎంతగా దిగజారిపోయారో అర్థమవుతుంది’ అని నెటిజన్లు తిట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దుమ్మెత్తి పోస్తోన్న నెటిజన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేడి కాఫీ లేదా కోల్డ్ కాఫీ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది?
వేడి కాఫీ లేదా కోల్డ్ కాఫీ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది?
అసెంబ్లీలో దుమ్ముదుమారమే.. సభ ముందుకు రెండు చారిత్రాత్మక బిల్లులు
అసెంబ్లీలో దుమ్ముదుమారమే.. సభ ముందుకు రెండు చారిత్రాత్మక బిల్లులు
IPL 2025: వామ్మో ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఏంటి భయ్యా ఇంత భయంకరంగా ఉంది!
IPL 2025: వామ్మో ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఏంటి భయ్యా ఇంత భయంకరంగా ఉంది!
కౌలుభూమిపై కన్నేసి.. తాగే నీళ్లలో పురుగు మందు కలిపి రైతు హత్య!
కౌలుభూమిపై కన్నేసి.. తాగే నీళ్లలో పురుగు మందు కలిపి రైతు హత్య!
నేడు అప్పు జయంతి నీవు లేవు నీ దారిని విడవం అంటున్న ఫ్యాన్స్..
నేడు అప్పు జయంతి నీవు లేవు నీ దారిని విడవం అంటున్న ఫ్యాన్స్..
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో బిగ్ బాస్ విన్నర్! కేసు నమోదు!
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో బిగ్ బాస్ విన్నర్! కేసు నమోదు!
రాయుడు, సచిన్ మెరుపులు.. ఫైనల్లో ఇండియా మాస్టర్స్ విజయం!
రాయుడు, సచిన్ మెరుపులు.. ఫైనల్లో ఇండియా మాస్టర్స్ విజయం!
వాష్ రూమ్‌కు వెళ్లగా గుండె ఆగినంత పనైంది.. కమోడ్ నుంచి భుసలు కొడు
వాష్ రూమ్‌కు వెళ్లగా గుండె ఆగినంత పనైంది.. కమోడ్ నుంచి భుసలు కొడు
మెగా వేలంలో ఛీ కొట్టారు.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లోకి ధోని శిష్యుడు.
మెగా వేలంలో ఛీ కొట్టారు.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లోకి ధోని శిష్యుడు.
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హీరోయిన్.. వ్యభిచార కేసులో చిక్కుకొని..
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హీరోయిన్.. వ్యభిచార కేసులో చిక్కుకొని..