Saiyara Movie: ఓరి మీ దుంపతెగ.. సైయారా సినిమా చూసి పొట్టుపొట్టుగా కొట్టుకున్న అబ్బాయిలు.. వీడియో ఇదిగో

'సైయారా' సినిమా చూసిన తర్వాత ఇద్దరు యువకులు ఒక అమ్మాయి కోసం గొడవ పడిన సంఘటన గ్వాలియర్ లో చోటు చేసుకుంది. సినిమా హాల్ వెలుపల జరిగిన ఈ గొడవ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Saiyara Movie: ఓరి మీ దుంపతెగ.. సైయారా సినిమా చూసి పొట్టుపొట్టుగా కొట్టుకున్న అబ్బాయిలు.. వీడియో ఇదిగో
Saiyara Movie

Updated on: Jul 27, 2025 | 7:51 AM

గత వారం థియేటర్లలో విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘సైయారా’ సంచలనాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది కేవలం ఒక వారంలోనే ఈ చిత్రం రూ. 165.46 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా చూడడం కోసం ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా యూత్ థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. ఈ సినిమా చూస్తున్న సమయంలో కొందరు థియేటర్‌లో ఏడుస్తున్నట్లు కూడా చాలా వార్తలు వచ్చాయి. ఇంతలో ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సైయారా సినిమా చూసిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు తమ గర్ల్ ఫ్రెండ్ కోసం గొడవ పడ్డారు. సినిమా హాల్ వెలుపల ఉన్న ఒక వ్యక్తి ఇద్దరు అబ్బాయిల మధ్య జరిగిన గొడవను తన మొబైల్‌లో వీడియో తీశాడు. ఆ తరువాత, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.

గ్వాలియర్‌లోని పడావ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని డిబి మాల్‌లో ఈ ఘటన జరిగింది. మొదట మాటలతో మొదలైన గొడవ.. క్రమంగా తీవ్రమైంది. ఇద్దరూ సినిమా హాల్ బయట ఒకరినొకరు తన్నడం, గుద్దుకోవడం ప్రారంభించారు. ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను చూడటానికి అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఆ సంఘటనను అక్కడే ఉన్న ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో బంధించాడు. తర్వాత అతను దానిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.

ఇవి కూడా చదవండి

కానీ ఆశ్చర్యకరంగా, ఈ దాడి సంఘటనకు సంబంధించి పోలీసులకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదు. వైరల్ వీడియోలో ఇద్దరు యువకులు కోపంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారు ఎవరి మాట వినలేదు.

వీడియ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..